Tomato Price: ఆ జిల్లాల్లో మార్కెట్ లో రైతు అమ్మితే కిలో టమాటా ధర రూపాయి.. రైతుబజారులో కస్టమర్ కొనాలంటే కిలో టమాటా రూ.10లు

టమాటా పంట దిగుబడి అధికంగా ఉండడం.. మరోవైపు ఎగుమతులు సరిగ్గా లేకపోవడంతో ఏపీలోని టమాటా రైతులు.. నష్టపోతూనే ఉన్నారు.

Tomato Price: ఆ జిల్లాల్లో మార్కెట్ లో రైతు అమ్మితే కిలో టమాటా ధర రూపాయి.. రైతుబజారులో కస్టమర్ కొనాలంటే కిలో టమాటా రూ.10లు
Today Tomato Price
Follow us

|

Updated on: Aug 13, 2022 | 9:54 AM

Tomato Price: రూపాయి ఇస్తే బిచ్చగాడు కూడా ఆ డబ్బులను తీసుకోకుండా.. ఏమి చేసుకోవాలి ఈ రూపాయితో అన్నట్లు మన ముఖం చూస్తాడు.. ఇంకా చెప్పాలంటే.. రూపాయికి కనీసం టీ కూడా రావడం లేదు.. కానీ అన్నదాత ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసి.. కన్నబిడ్డలకంటే అధికమైన ప్రేమతో పంటలను సంరక్షిస్తూ.. పంటలను పండించే పంట మాత్రం అవసరమైతే మార్కెట్ లో కిలో రూపాయికి కూడా దొరుకుంటుంది. టమాటా పంట దిగుబడి అధికంగా ఉండడం.. మరోవైపు ఎగుమతులు సరిగ్గా లేకపోవడంతో ఏపీలోని టమాటా రైతులు.. నష్టపోతూనే ఉన్నారు.  గత కొన్ని రోజులుగా ఏపీలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిలాల్లోని మార్కెట్లల్లో టమాటా ధరలు భారీగా పతనం అయ్యాయి. కిలో  ఐదు రూపాయలకు అమ్ముడుపోయేవి.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మరింతగా దిగజారింది. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో టమాటా ధరలు గణనీయంగా పడిపోయాయి. నంద్యాల జిల్లా ప్యాపీలి మార్కెట్లో కిలో టమోటా ధర రూపాయి మాత్రమే పలుకుతోంది. దీంతో అన్నదాత తాము పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

మార్కెట్ లో కిలో టమాటా ధర రూపాయి ఉండగా.. రైతు బజార్లో, బహిరంగ మార్కెట్లలో మంత్రం టమాటా ధర భిన్నంగా ఉంది. మరోవైపు కర్నూలు సి క్యాంపు రైతు బజార్లో కిలో టమోటా పది రూపాయాలుగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..