Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం.. నిన్న ఒక్క రోజు ఎంత వచ్చిందంటే..

Tirumala Hundi: తిరుమల శ్రీవారికి ఎంతో ప్రముఖ్యత ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు చాలా మంది వస్తుంటారు. అంతేకాదు ఆదాయం..

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం.. నిన్న ఒక్క రోజు ఎంత వచ్చిందంటే..
Tirumala Hundi
Follow us

|

Updated on: Mar 19, 2021 | 10:30 AM

Tirumala Hundi: తిరుమల శ్రీవారికి ఎంతో ప్రముఖ్యత ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు చాలా మంది వస్తుంటారు. అంతేకాదు ఆదాయం కూడా భారీగానే వస్తుంటుంది. దీంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఇక గురువారం తిరుమల శ్రీవారిని 50,087 మంది భక్తులు దర్శించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో 2 కోట్ల రూపాయలు దాటని శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయల ఆదాయం దాటేసింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమలి తిరుపతిదేవస్థానం తెలిపింది. అలాగే 25,466 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే కరోనా కాలంలో శ్రీవారి ఆదాయం పూర్తిగా తగ్గిపోగా, మెల్లమెల్లగా ఆదాయం పుంజుకుంది. ప్రతి రోజు దాదాపు 2 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. మహా అయితే 3 కోట్ల వరకు వచ్చేది. కాని గురువారం రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

కరోనా కేసులు తగ్గిపోయిన తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కాగా, ఇటీవల ముంబాయికి చెందిన ఓ భక్తుడు శ్రీవారికి రూ.300 కోట్లను విరాళంగా అందించారు. ఆస్పత్రిని నిర్మించేందుకు ఈ డబ్బులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. దేవస్థానం అధికారులతో ఆయన ఒప్పందం కూడా కూదుర్చుకున్నారు. త్వరలో ఆస్పత్రి నిర్మాణం చేపడతానని అన్నారు.

కాగా, తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజతో పాటు బుధవారం చేసే సహస్ర కలశాభిషేకం, నిత్యం నిర్వహించే ఆర్జిత వసంతోత్సవ సేవలను ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. తద్వారా మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల అరుగుదలను నిరధించవచ్చని టీటీడీ భావిస్తోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలిలో తీర్మానించారు.

ఇవీ చదవండి:

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

Tirumala: తిరుమలలో ఏడాదికి ఒక్కసారి అభిషేకం..విగ్రహాల అరుగుదలకు కీలక నిర్ణయం.. ధర్మకర్త మండలి ఆమోదముద్ర

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..