Andhra Pradesh: సీఎం జగన్ కుప్పం పర్యటన 23కు వాయిదా.. టార్గెట్ 175లో తొలి అడుగు ఇక్కడి నుంచే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు..

Andhra Pradesh: సీఎం జగన్ కుప్పం పర్యటన 23కు వాయిదా.. టార్గెట్ 175లో తొలి అడుగు ఇక్కడి నుంచే..
Cm Ys Jagan
Follow us

|

Updated on: Sep 20, 2022 | 5:52 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ప్రణాళికలు రూపొందిస్తుండగా.. ఈ సారి చేసిన సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో తమను విజయతీరాలకు చేర్చుతాయని అధికార పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ గతంలో కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. టార్గెట్ 175గా పని చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే మార్పును ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22న కుప్పంలో పర్యటించేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధమయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ నెల 22న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడింది. ఈ నెల 23న కుప్పంలో సీఎం జగన్ పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హెలిప్యాడ్‌, బహిరంగ సభ స్థలాలను సైతం పరిశీలించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీల ఓట్లతో కుప్పంలో గెలిచిన చంద్రబాబు రైతులకు చేసిందేమి లేదని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి కుప్పం నియోజకవర్గంలో జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ న్యూస్ కోసం