Tirumala News: శ్రీవారికి కాసుల వర్షం.. నవంబర్‌లో తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..
ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. గత జనవరి నుంచి డిసెంబర్ నెల ఇప్పటి దాకా భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నట్లే వెంకన్న హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.

ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. గత జనవరి నుంచి డిసెంబర్ నెల ఇప్పటి దాకా భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నట్లే వెంకన్న హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. గత కొద్ది నెలలుగా అంతకంతకు పెరుగుతున్న హుండీ కలెక్షన్ ప్రతినెల రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. అందుకే వెంకన్న ఆదాయం కూడా ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతోంది. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపోబోతోంది. ఇలా వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది.
ఇప్పటికే వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మొత్తం భక్తులతో కొండ కిటకిటి లాడింది. హుండీ ఆదాయం కూడా పెరిగింది. నవంబర్ నెలలో మొత్తం హుండీ ఆదాయం రూ. 116, 20,74,100 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి వచ్చింది. 21,15,330 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా 7,79,499 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. 57,35,934 మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు.
నవంబర్ నెలలో తిరుమల యాత్రకు వచ్చిన భక్తులకు టిటిడి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించింది. రూ. 116 కోట్ల కు పైగా హుండీ ద్వారా ఆదాయాన్ని పొందడమే కాదు టిటిడి నిర్వహిస్తున్న పలు ట్రస్టులకు, శ్రీవారికి విలువైన ఆభరణాలను, స్థిరస్తులను, వస్తువులను భక్తులు కానుకలుగా సమర్పించారు.
మరినని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




