Andhra Pradesh: బ్యాగు చెక్ చేయాలని చెప్పి.. అరకేజీ బంగారం కొట్టేశారు.. సీసీ కెమెరా చూస్తే దిమ్మతిరిగిపోయింది..

దాదాపు 50 తులాల బంగారం. వ్యాపార అవసరాల కోసం తరలిస్తుండగా.. కాపు కాచిన దుండగులు చాకచక్యంగా కొట్టేశారు. తాము పోలీసులమని, గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం ఉందని చెప్పి ఉన్నదంతా దోచుకున్నారు. తీరా..

Andhra Pradesh: బ్యాగు చెక్ చేయాలని చెప్పి.. అరకేజీ బంగారం కొట్టేశారు.. సీసీ కెమెరా చూస్తే దిమ్మతిరిగిపోయింది..
Ongole Theft
Ganesh Mudavath

|

Sep 21, 2022 | 9:32 PM

దాదాపు 50 తులాల బంగారం. వ్యాపార అవసరాల కోసం తరలిస్తుండగా.. కాపు కాచిన దుండగులు చాకచక్యంగా కొట్టేశారు. తాము పోలీసులమని, గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం ఉందని చెప్పి ఉన్నదంతా దోచుకున్నారు. తీరా తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అర కేజీ బంగారం చోరీ కలకలం రేపింది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చిన వ్యక్తి వద్ద ఈ బంగారాన్ని గుర్తించారు. వ్యాపారి దగ్గర పనిచేసే గుమస్తా బాలాజీని ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి ఏమార్చి 460 గ్రాముల బంగారు నగలను తీసుకుని ఉడాయించారు.ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర పార్శిల్‌ సర్వీస్‌ ఎదుట ఈ సంఘటన జరిగింది. కోయంబత్తూరు నుంచి బంగారు నగలు తీసుకుని ఒంగోలులో డెలివరీ చేసేందుకు వచ్చిన బాలాజీని ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. తాము పోలీసులమని, గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు తమకు సమాచారం ఉందని బెదిరించారు. బ్యాగు చూపించాలంటూ సోదా చేశారు. బాలాజీని మాటల్లో పెట్టి బ్యాగులో ఉన్న బంగారాన్ని దొంగిలించారు. బ్యాగులో ఉన్న కొన్ని కాగితాలు, ఇతర వస్తువులను సోదా చేసి గంజాయి దొరకలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనంతరం బ్యాగ్‌ను చెక్‌ చేసుకున్న బాలాజీ ఇరవై లక్షల విలువైన 460 గ్రాముల బంగారం కనిపించలేదని గుర్తించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గరకు చేరుకుని విచారణ ప్రారంభించారు.

పార్సిల్‌ సర్వీస్‌ దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ కెమెరాలకు ఫ్లెక్సీ అడ్డు రావడంతో బాలాజీని మోసం చేసిన వారి విజువల్స్‌ రికార్డు కాలేదు. ఈ ఘరానా చోరీకి పాల్పడింది బాలాజీని ముందు నుంచి అనుసరిస్తూ వచ్చిన వారే అయి ఉంటారని అనుమానిస్తున్నారు.బాలాజీ దగ్గర బంగారం ఉందని తెలుసుకుని పోలీసులమని చెప్పి సోదాలు చేసినట్టు నటించి బ్యాగ్‌లో ఉన్న బంగారాన్ని చాకచక్యంగా అపహరించి ఉంటారని భావిస్తున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వారి వివరాలు సేకరిస్తున్నారు. యజమాని అనుమతితో అన్ని వివరాలు తరువాత చెబుతానని అంటున్నాడు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu