కడప జిల్లాలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ చేసిన 3 థియేటర్లు సీజ్

కడప: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా కడప జిల్లాలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని ప్రదర్శించిన మూడు సినిమా థియేటర్లను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 1న కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్, రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఏపీలో సినిమా విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ఈ థియేటర్ల యజమానులు మాత్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులను లెక్కచేయకుండా ఈ నెల 1న మార్నింగ్‌ […]

కడప జిల్లాలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ చేసిన 3 థియేటర్లు సీజ్
Follow us

|

Updated on: May 04, 2019 | 7:55 AM

కడప: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా కడప జిల్లాలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని ప్రదర్శించిన మూడు సినిమా థియేటర్లను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 1న కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్, రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఏపీలో సినిమా విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ఈ థియేటర్ల యజమానులు మాత్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులను లెక్కచేయకుండా ఈ నెల 1న మార్నింగ్‌ షో వేశారు. విషయం తెలిసిన స్థానిక రెవిన్యూ అధికారులు థియేటర్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హెచ్చరించి వదిలిపెట్టారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం ప్రదర్శనను నిలిపివేయడంలో విఫలమైన కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది శుక్రవారం మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు థియేటర్లపై చర్యలకు ఉపక్రమించారు. ఆఘమేఘాల మీద జిల్లాలోని మూడు థియేటర్లను సీజ్ చేయాలనిఆదేశాలు జారీచేశారు. దీంతో కడప, పోరుమామిళ్ల, రైల్వేకోడూరు మండలాల తహసీల్దార్లు ఈ సాయంత్రం మూడు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. ఇక నుంచి ఏ మూవీని ప్రదర్శించకూడదని నోటీసులు ఇచ్చారు.