TDP News: గతంలో కీలక పదవులు అనుభవించారు.. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే అడ్రెస్ లేని ఆ సీనియర్ లీడర్లు

తెలుగు దేశం పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించారు. చంద్రబాబు చుట్టూ తిరుగుతూ అధికారం చెలాయించారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే ముఖం చాటేస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరు?

TDP News: గతంలో కీలక పదవులు అనుభవించారు.. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే అడ్రెస్ లేని ఆ సీనియర్ లీడర్లు
Tdp

Telugu Desam Party: తెలుగు దేశం పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించారు. చంద్రబాబు చుట్టూ తిరుగుతూ అధికారం చెలాయించారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే ముఖం చాటేస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

టీడీపీ హెడ్ క్వార్టర్స్‌పై మంగళవారంనాడు దాడి జరిగింది. ఆఫీస్‌లో భయానక బీభత్స వాతావరణం నెలకొంది. అధికార ప్రతినిధి పట్టాభి ఇంట్లో విధ్వంసం జరిగింది. మరుసటి రోజు(బుధవారం) టీడీపీ రాష్ట్ర రాష్ట్ర బంద్ చేపట్టింది. దీనికి కొనసాగింపుగా గురువారంనాడు ఉదయం నుంచి చంద్రబాబు 36 గంటల దీక్షకు పూనుకున్నారు. మరోవైపు వైసీపీ కౌంటర్ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. రెండు పార్టీల నేతల మధ్య యుద్ధాన్ని తలపించేలా డైలాగ్ వార్ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మొత్తం అల్లకల్లోలంగా ఉంది. మరీ ఇంత రచ్చ జరుగుతుంటే వాళ్లెక్కడున్నారు? ఏమైపోయారు?

వైసీపీ పవర్‌లోకి వచ్చాక ప్రతిపక్ష టీడీపీకి ఈ రేంజ్‌లో హైప్ వచ్చింది ఇప్పుడే. తెలుగుదేశం హెడ్ ఆఫీస్‌పై అటాక్‌ ఇష్యూ తర్వాత రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. చంద్రబాబు తన వయసును కూడా లెక్కచేయకండా 36గంటల దీక్షకు దిగారు. ఇంత జరుగుతుంటే చాలామంది టీడీపీ లీడర్స్ మాత్రం తమకేమీ పట్టనట్టే ఉండిపోయారు. ఇదే, ఇప్పుడు తెలుగుదేశంతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏమైపోయారు? సగటు టీడీపీ కార్యకర్త అడుగుతోన్న ప్రశ్న ఇది. జేసీ దివాకర్‌రెడ్డి, చాంద్‌ బాషా, దీపక్‌రెడ్డి… వీళ్లంతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినవాళ్లే. మరి, ఇప్పుడు వీళ్లెక్కడ? అని టీడీపీ సామాన్య కార్యకర్తలు సైతం ప్రశ్నిస్తున్నారు.

అలాగే అశోక్‌ గజపతిరాజు, కిశోర్ చంద్రదేవ్‌, సుజయ్‌కృష్ణ రంగారావు, గంటా శ్రీనివాసరావు… వీళ్లలో కొందరు కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. అశోక్‌ గజపతిరాజైతే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. కానీ, వీళ్లెవరూ టీడీపీ నిరసనల్లో కనిపించనే లేదు. కనీసం ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వకుండా ఇంట్లోనే సైలెంట్‌గా ఉండిపోయారు.

కీలకమైన కృష్ణాజిల్లాలోనూ ఇదే సిట్యువేషన్. విజయవాడ ఎంపీ ఎంపీ కేశినేని… మాజీ డిప్యూటీ స్పీకర్, అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ మండలి బుద్ధ ప్రసాద్… మాజీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, స్వామిదాసు… పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉండిపోయారు.

ఇక, చంద్రబాబు సొంత జిల్లాలోనూ ఇదే పరిస్థితి. టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు గల్లా అరుణకుమారి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ, నగరి టీడీపీ ఇన్‌ఛార్జ్ గాలి భానుప్రకాష్, పూతలపట్టు టీడీపీ ఇన్‌ఛార్జ్ లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు… ఇలా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న లీడర్ల లిస్ట్ పెద్దగానే కనిపిస్తోంది.

ప్రకాశం జిల్లాకొచ్చే కందుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తదితరులు నాన్ యాక్టివ్‌ ఉంటున్నారు.

పార్టీతో విసిగిపోయారా? పార్టీని వదిలేస్తున్నారా? లేక మనకెందులే ఈ తలపోటనుకుని బీపీ టాబ్లెట్స్ వేసుకుని హాయిగా ఇంట్లో కూర్చున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మాత్రం వాళ్లే.

జిల్లాల వారీగా కీలక సమయంలో పార్టీకి ముఖం చాటేసిన నేతలు వీరే..

వీళ్లెక్కడ? (అనంతపురం జిల్లా)

జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ
చాంద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యే
దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

వీళ్లెక్కడ? (విశాఖ జిల్లా)

గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి

వీళ్లెక్కడ? (కృష్ణా జిల్లా)

కేశినేని నాని, విజయవాడ ఎంపీ
ఉప్పులేటి కల్పన, మాజీ ఎమ్మెల్యే (పామర్రు)
మండలి బుద్ధప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్, (అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్)
స్వామిదాసు, మాజీ ఎమ్మెల్యే (తిరువూరు)

వీళ్లెక్కడ? (విజయనగరం)

అశోక్‌ గజపతిరాజు, (టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు), (కేంద్ర మాజీ మంత్రి)
సుజయ్‌కృష్ణ రంగారావు, మాజీ మంత్రి
కిశోర్ చంద్రదేవ్‌, కేంద్ర మాజీ మంత్రి

వీళ్లెక్కడ? (చిత్తూరు)

గల్లా అరుణకుమారి, మాజీ మంత్రి
టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి
శంకర్, మాజీ ఎమ్మెల్యే, తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్
గాలి సరస్వతమ్మ, మాజీ ఎమ్మెల్సీ
గాలి భానుప్రకాష్, నగరి టీడీపీ ఇన్‌ఛార్జ్
లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు టీడీపీ ఇన్‌ఛార్జ్
సీకే బాబు, మాజీ ఎమ్మెల్యే

వీళ్లెక్కడ? (ప్రకాశం)

పోతుల రామారావు, కందుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్
దివి శివరాం, మాజీ ఎమ్మెల్యే

Also Read..

Samantha: కోర్టులో సమంతకు కొత్త ట్విస్ట్.. పిటిషన్ అత్యవసర విచారణకు అభ్యంతరం

Kidney Transplant: పంది కిడ్నీ మనిషికి.. ప్రపంచంలో తొలిసారిగా విజయవంతం అయిన ఆపరేషన్.. ఇది ఎలా చేశారంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu