Andhra Pradesh: అమ్మను భారంగా భావించిన ఓ కూతురి నిర్వాకం.. నడిరోడ్డుపై ఆ తల్లి ఎదురుచూపులు..
నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లిని ఓ కూతురు భారంగా భావించింది.. జాలి, దయ, కనికరం లేకుండా మతిస్థిమితం లేని వృద్ధురాలిని ఓ వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్ళిపోయింది.. కానీ, ఆశ్రమం వారుకూడా లోపలికి అనుమతించలేదు.. దింతో ఆకలితో అలమటిస్తూ తన బిడ్డ వస్తుందని ఆ వృద్ధురాలు రోడ్డుపైనే ఎదురుచూస్తూనే ఉండిపోయింది.. ఈ ఘటన స్థానికుల్ని కలచి వేసింది. వృద్ధురాలి ధీనస్థితి చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లిని ఓ కూతురు భారంగా భావించింది.. జాలి , దయ ,కనికరం లేకుండా మతిస్థిమితం లేని వృద్ధురాలిని ఓ వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్ళిపోయింది.. కానీ ఆశ్రమం వారుకూడా లోపలికి అనుమతించలేదు.. దింతో ఆకలితో అలమటిస్తూ తన బిడ్డ వస్తుందని ఆ వృద్ధురాలు రోడ్డుపైనే ఎదురుచూస్తూ ఉండిపోయింది.. ఇప్పుడు ఈఘటన విజయవాడలో అందరిని కలచివేస్తుంది..
తల్లిదండ్రులను భారంగా భావిస్తూ.. వదిలివేస్తున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాము.. నవ మాసాలు మోసి కని పెంచిన కన్న ల్లిని ఓ కుమార్తె భారంగా బావించింది. కొంచెం అంటే కొంచెం కూడా దయ లేకుండా మతిస్థిమితం లేని అమ్మను వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఆశ్రమం వారు సైతం ఆమెను లోపలి రానివ్వలేదు. దింతో ఆకలితో అలమటిస్తూ.. తన కూతరు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఈ హృదయవిదారకర సంఘటన విజయవాడ పాయకాపురంలో చేటుచేసుకుంది.
గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవికి ఒక్కగానొక్క కుమార్తె.. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పోషించింది. అంతే కాదు మంచి చదువు చెప్పించింది..సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి వివాహం కూడా జరిపించింది. తన అవసరాలు తీరిపోయాయని అనుకుందో ఏమో కానీ, ఆ కూతురు తల్లిని వదిలించుకోవాలనుకుంది. అమ్మ పట్ల కఠినంగా వ్యవహరించింది.
మతిస్థిమితం కొల్పోయిన తల్లిని కొన్ని రోజుల క్రితం విజయవాడలోని మున్సిపల్ వృద్దాశ్రమంలో చేర్పించింది. ఇటీవల బుడమేరుకు వచ్చిన వరదల సమయంలో ఆమెను కుమార్తె , అల్లుడు ఇంటికి తీసుకువెళ్లారు. వృద్ధురాలిని ఆశ్రమం వద్దకు తీసుకురావొద్దని చెప్పడంతో అప్పటి నుంచి కూతురి ఇంటి వద్దే ఉంటోంది. అయితే, ఏం జరిగిందో ఏమోగానీ, శుక్రవారం ఓ బైక్ పైన తీసుకువచ్చి వృద్ధాశ్రమం వద్ద వదిలి వెళ్లిపోయారు. అది గమనించిన వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆమెను లోపలికి రావివ్వలేదు.. ఏం జరుగుతుందో తెలియని ఆతల్లి ఆశ్రమం గేటు పట్టుకొని అక్కడే ఉండిపోయింది.
వీడియో ఇక్కడ చూడండి..
వృద్ధురాలు ఆకలితో అలమటిస్తూ దిన స్థితిలో ఉన్న ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఆమెను బలవంతంగా తీసుకువచ్చి ఆశ్రమ గేటు వద్ద వదిలివెళ్ళిపోయారని అక్కడి స్థానికులు చెబుతున్నారు..వృద్ధురాలి కూతురికి ఫోన్ చేసిన స్పందించడం లేదని అంటున్నారు.. వృద్ధురాలిని ఆశ్రమంలో చేర్చుకోవాలని అక్కడకి వచ్చిన స్థానికులు నిర్వాకులకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆశ్రమం సిబ్బంది ససేమిరా అన్నారు.. దీంతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమం నిర్వాహకురాలిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.