Andhra Pradesh: కరోనా కొత్త వేరియంట్ పై పోరుకు సిద్ధమైన సర్కార్.. పక్కా ప్రణాళికతో.. భారీ ఏర్పాట్లతో..

కరోనా కొత్త వేరియెంట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని జాగ్రత్తలతో ముందస్తు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 29 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లలో పరీక్షలు చేసేందుకు నిర్ణయించింది. అంతే కాకుండా విజయవాడలో...

Andhra Pradesh: కరోనా కొత్త వేరియంట్ పై పోరుకు సిద్ధమైన సర్కార్.. పక్కా ప్రణాళికతో.. భారీ ఏర్పాట్లతో..
CM Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Dec 22, 2022 | 5:02 PM

కరోనా కొత్త వేరియెంట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని జాగ్రత్తలతో ముందస్తు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 29 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లలో పరీక్షలు చేసేందుకు నిర్ణయించింది. అంతే కాకుండా విజయవాడలో జినోమ్ సెక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేసింది. ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లో10 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచనుంది. అన్ని జిల్లాల్లో కలిపి 34,763 ఆక్సిజన్ బెడ్లు, 8594 ఐసీయూ బెడ్లు,12,292 సాధారణ బెడ్లను అరేంజ్ చేసింది. పెడియాట్రిక్ ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేసింది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. గత 50 రోజుల్లో 30 వేల శ్యాంపిల్స్ లో 130 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. లోక్‌సభలో కేంద్రమంత్రి మాండవీయ కీలక ప్రకటన చేశారు. కొత్త వేరియంట్‌ BF-7పై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరూ మాస్క్‌ కచ్చితంగా వాడేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు.

చాలా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కరోనా రక్కసి ఇప్పుడు మరోసారి భారత్‌లోనూ పంజా విసురుతోంది. గుజరాత్‌లో రెండు, ఒడిశాలో రెండు కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 కేసులు గుర్తించారు. చైనా ప్రకంపనలతో భారత్‌లో హై ఎలర్ట్‌ ప్రకటించారు. భారత వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు మాస్కులు ధరించాలనీ, బూస్టర్‌ డోసు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది.

బీఎఫ్ – 7 వైరస్‌ బారిన పడిన వారిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్, జ్వరం, దగ్గు, అలసట, గొంతు నొప్పి, కండరాల నొప్పి, మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ వ్యాధి సోకకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పక ధరించాలి. అందరూ బూస్టర్ డోస్‌లు తీసుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సరైన పరిశుభ్రతను పాటించాలి. బలమైన ఆహారం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??