Termites Consumed Man Savings : ఓ ఫ్యామిలీ కష్టార్జితమైన నోట్లకు పట్టిన చెదలు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబం

కృష్ణ జిల్లా మైలవరం లో దారుణ ఘటన జరిగింది. ఓ పేద కుటుంబం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులకు చెదలు పట్టాయి. సుమారు రూ. 5 లక్షల వైలువైన నోట్లకు చెదలు...

Termites Consumed Man Savings : ఓ ఫ్యామిలీ కష్టార్జితమైన నోట్లకు పట్టిన చెదలు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబం
Follow us

|

Updated on: Feb 17, 2021 | 6:17 PM

Termites Consumed Man Savings : కృష్ణ జిల్లా లో దారుణ ఘటన జరిగింది. ఓ పేద కుటుంబం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులకు చెదలు పట్టాయి. సుమారు రూ. 5 లక్షల విలువైన నోట్లకు చెదలు పట్టేశాయి. దీంతో పేద కుటుంబం ఆందోళ వ్యక్తం చేస్తోంది. ఈ నోట్లలో రూ. 2వేల నోటు నుంచి రూ. 10 రూ వరకూ అన్ని ఉన్నాయి. కష్టపడి సంపాదించిన డబ్బును ఆ పేద కుటుంబం ట్రంక్ పెట్టెలో పెట్టుకుంది. అలా దాచుకున్న సొమ్ముకు ఇప్పుడు చెదలు పట్టడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది వివరాల్లోకి వెళ్తే..

కృష్ణా జిల్లా మైలవరం పట్టణం విజయవాడ రోడ్డులో వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో బిజిలీ జమలయ్య కుటుంబం నివాసముంటుంది. ఈ దంపతులు పందులు పెంచి అమ్ముతూ సొంత ఇల్లు కట్టుకోవాలని ఏడాదిన్నరగా తాను సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని కూడబెడుతూ వచ్చాడు. అయితే జమలయ్యకు బ్యాంకు లో ఖాతాలేదు దీంతో కొంత మొత్తాన్ని రోజూ ట్రంకు పెట్టెలో వేస్తూ వచ్చాడు..

అయితే ఇటీవల పందుల వ్యాపారానికి లక్ష రూపాయలు అవసరమైంది. దాంతో సోమవారం రాత్రి డబ్బు దాచుకున్న ట్రంకు పెట్టెను తీసి చూసిన జమలయ్య నిర్ఘాంతపోయాడు. పది, యాభై, వంద, ఐదొందలు ఇలా దాచుకున్న నోట్లకు చెదలుపట్టి ఉండడంతో జమలయ్య బావురుమన్నాడు. ఏమి చెయ్యాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ డబ్బులు ఎక్కడైనా దొరికిన డబ్బా, లేక నిజంగానే దాచుకున్న సొమ్ముకు చెదలు పట్టిందా అని విచారించారు. చివరకు సొమ్ము అతడిదే అని తేల్చారు. పోలీసులను చూడడంతోనే బావురుమంటూ తమ భాధ వెళ్ళగక్కారు జమలయ్య కుటుంబీకులు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.

గ్రామస్థులు ఈ నోట్లకు ఆర్బీఐ ఏమైనా రీప్లేస్ చేసేవీలుంటే బాగుండును అని అంటున్నారు. అయితే ఈ విషయంపై బాంక్ సిబ్బంది స్పందిస్తూ.. చెదలు తినేసిన నోట్లు, కాలిపోయిన నోట్లు బ్యాంకుల్లో చెల్లుబాటు కావని చెప్పారు.కరెన్సీ నోట్లపై పైన కింద ముద్రించిన నంబర్లు సరిగా ఉంటేనే బ్యాంకుల్లో చెల్లుబాటవుతాయని చెప్పారు.

Also Read:

పెద్ద ఈల్ చేపను తినడానికి కష్టపడిన ఓ చిన్న చేప.. ఆ చేప తిప్పలు చుస్తే నవ్వు ఆగదు

తొక్కేకదా అని తీసి పడేయకండి.. అరటిపండు తొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..