Jaggayyapeta: జగ్గయ్యపేట లెక్కింపు కేంద్రంలో ఉద్రిక్తత.. మూడోసారి రీ కౌటింగ్ నిర్వహిస్తున్న అధికారులు..!

కృష్ణా జల్లా జగ్గయ్యపేట నగర పంచాయతీ కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. 13 వ వార్డులో టీడీపీ అభ్యర్థి, తన సమీప వైసీపీ అభ్యర్థిపై 5 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Jaggayyapeta: జగ్గయ్యపేట లెక్కింపు కేంద్రంలో ఉద్రిక్తత.. మూడోసారి రీ కౌటింగ్ నిర్వహిస్తున్న అధికారులు..!
Jaggayyapeta Municipal Election Counting
Balaraju Goud

|

Nov 17, 2021 | 11:44 AM

Jaggayyapeta Municipal Election Counting: కృష్ణా జల్లా జగ్గయ్యపేట నగర పంచాయతీ కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. 13 వ వార్డులో టీడీపీ అభ్యర్థి, తన సమీప వైసీపీ అభ్యర్థిపై 5 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, లెక్కింపు సరిగా జరగలేదని, మరోసారి కౌటింగ్ చేపట్టాలంటూ వైసీపీ అభ్యర్థి పట్టుబట్టారు. అభ్యర్థి కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే ఉదయ భాను దగ్గరుండి రీ కౌంటింగ్ చేయించారు. రీ కౌంటింగ్ లోనూ తెలుగు దేశం అభ్యర్థికి అదే మెజారిటీ వచ్చింది. అయితే, రీ కౌంటింగ్ సరిగా జరగలేదని, మరోసారి ఓట్లను లెక్కించాలంటూ ఎమ్మెల్యే ఉదయభాను అనుచరుల ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో తెలుగుదేశం – వైసీపీ నేతల మధ్య కొద్దిసేపు ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో మూడోసారి రీ కౌంటింగ్ చేపట్టారు ఎన్నికల అధికారులు.

Read Also… Viral Video: ‘వీడికి ఒక్కసారే దెయ్యం పట్టిందా ఏంటి..?’.. నవ వధువుపై విరుచుకుపడ్డాడు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu