TDP Politics: అలాంటి నేతలకు ఛాన్సే లేదు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. నేతల అయోమయం..!

Chandrababu Warning: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ ఆ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

TDP Politics: అలాంటి నేతలకు ఛాన్సే లేదు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. నేతల అయోమయం..!
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 27, 2021 | 8:40 AM

Chandrababu Warning: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ ఆ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతా చూస్తున్నానని, ఏం చేయాలో అదే చేస్తానని సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. పసుపు దళపతి చంద్రబాబు సమక్షంలో జమ్మలమడుగు నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్‍రెడ్డి, ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి తదితరులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఎన్నికల ముందు పార్టీలు మారే నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వలస పక్షులకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఆయన చేసిన ఈ కామెంట్స్‌ టీడీపీ హాట్‌ టాపిక్‌గా మారాయి.

పార్టీ కోసం ఎవరు కష్ట పడతారో వారికి మాత్రమే పదవులు ఇస్తానని క్లారిటీ ఇచ్చారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఎలక్షన్ ముందు పార్టీలో చేరే వారికి అంత ప్రాధాన్యత ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల సమయానికి టీడీపీలో చేరుదామని అనుకున్నవారికి బాబు కామెంట్స్‌ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. పార్టీలో ఎవరు పని చేస్తున్నారో అన్ని లెక్కలు రాసుకుంటున్నాను అని చెప్పారు చంద్రబాబు. పార్టీ కోసం పని చేయని వారిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలు మారి వచ్చే వారికి అసలు ప్రాధాన్యమిచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. వలస పక్షులకు ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వననని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో గుర్తించి వారికి మాత్రమే తిగిన ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు కూడా పనితనం ఆధారంగా కేటాయిస్తామన్నారు చంద్రబాబు. అయితే, చంద్రబాబు కామెంట్స్‌పై ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. అధినేత మనసులో ఏం ఉందో అని చర్చించుకుంటున్నారు కార్యకర్తలు.

Also read:

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్