TDP: ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది.. ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన నారా లోకేష్..

అదే జగన్ రెడ్డి రివర్స్ పోలీసింగ్ ప్రత్యేకత అంటూ సెటైర్లు సందించారు. 2013 లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి చెందిన 60 మంది నాయకులు, 5 వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని..

TDP: ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది.. ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన నారా లోకేష్..
Nara Lokesh
Follow us

|

Updated on: Oct 18, 2022 | 4:41 PM

తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. కడప జిల్లా జైలులో ఉన్న పార్టీ నేత ప్రవీణ్ రెడ్డిని ఆయన మంగళవారం కలిశారు. ఆయనతో పాటు మరో 17 మందికి జైల్లోకి అనుమతించారు.జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు.కడప సెంట్రల్ జైలు దగ్గరకు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు..అటు ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత బయట వచ్చి మీడియాతో నారా లోకేష్ మాట్లాడారు. అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడబోరని ఆయన తేల్చి చెప్పారు. బయటకు వచ్చాక ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తానని ప్రవీణ్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని అన్నారు. పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారని లోకేష్ గుర్తుచేశారు.

ఈ విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలనూ కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితపైనా కేసులు పెట్టారని అన్నారు. వాళ్లు కూడా దళితులే అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత భయపడిపోతోందో అర్థమవుతోందన్నారు లోకేష్.

సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్యాలెస్ పిల్లీ అంటూ ఎద్దేవా చేశారు లోకేష్. ప్యాలస్ పిల్లికి టీడీపీ నేతలను చూసినా.. కార్యకర్తలు ఓ ట్వీట్ పెట్టినా వణుకు పుడుతుందన్నారు. అందుకే అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు లోకేష్. రాష్ట్రంలో పోలీసులు జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారని.. బాధితులపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

అదే జగన్ రెడ్డి రివర్స్ పోలీసింగ్ ప్రత్యేకత అంటూ సెటైర్లు సందించారు. 2013 లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి చెందిన 60 మంది నాయకులు, 5 వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని.. 70 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని హత్య చేశారని లోకేష్ ఆరోపణలు గుప్పించారు.

2014 ఏప్రిల్ 13 న మ్యానిఫెస్టో విడుదల చేస్తూ హైదరాబాద్ ని మించిన నగరం… వాషింగ్టన్ డిసి లాంటి నగరం కడతాం అని అన్నారు. ఎన్నికలు అయిన తరువాత 2014 జులై 23 న జగన్ రెడ్డి ఎం అన్నారు? రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలి కనీసం 30 వేల ఎకరాలు ఉండాలి అన్నారు.

2014 సెప్టెంబర్ 4 న జగన్ రెడ్డి గారు అసెంబ్లీ లో ఎం అన్నారు? అమరావతి లో రాజధాని ని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అన్నారు. అంతే కాదు ఆయన మరో మాట కూడా అన్నారు చిన్న రాష్ట్రం అయ్యింది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మాకు ఇష్టం లేదు అని అన్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో పోరాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడుపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు నారా లోకేష్. వైఎస్ వివేకానంద కుటుంబానికి న్యాయం దక్కాలంటే వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసినందుకు బీటెక్ రవిపై కేసులు పెట్టారని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తూ ప్రయాణం మధ్యలో ఎయిర్ పోర్ట్ రన్ వే పైన అరెస్టు చేశారని గుర్తుచేశారు.

టీడీపీ ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని లోకేష్ నిలదీశారు. ప్రవీణ్‌ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. కడప స్టీల్ కోసం పోరాటం చేసిన ప్రవీణ్ రెడ్డి ఇంటిపై వైసీపీ గుండాలు దాడి చేశారని మండిపడ్డారు. అయితే, పోలీసులు మాత్రం దాడి చేసినవారిని కాకుండా.. ప్రవీణ్ రెడ్డిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రవీణ్ రెడ్డిపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లోకేష్.

ప్రొద్దుటూరు కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్ మాఫియాకు స్వయంగా అక్కడి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి డాన్ అని నారా లోకేశ్ ఆరోపించారు. ఆయన పేరు రాచమల్లు బెట్టింగ్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. బెట్టింగ్ దందా నిర్వాహకుల నుంచి ఆయనకు వాటా అందుతుందని ఆరోపించారు. దందాలు, సెటిల్ మెంట్లు చేయడానికి ఏకంగా పోలీసులనే వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే బావమరిది ప్రమేయం ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. భయమనేది తమ బయోడేటాలోనే లేదని లోకేశ్ తేల్చిచెప్పారు. తమపై ఎన్ని కేసులు కావాలంటే అన్నీ పెట్టుకొమ్మని ప్రభుత్వానికి ఆయన సవాల్ చేశారు.

జగన్ రెడ్డి గారి కోరిక మేరకే మేము అమరావతిని రాజధానిగా ప్రకటించాం. 2017 జూలై 9 న ప్లినరీ లో అమరావతి వేదికగా చెబుతున్నా ఇక్కడే రాజధాని అన్నారు. 2017 జూలై 19 న అమరావతిలో ఇళ్ళు కట్టుకున్నా, రైతులు ఆనంద పడేలా రాజధాని నిర్మిస్తా అన్నారు జగన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ రెడ్డి మాట మార్చారు.. మడమ తిప్పారు. అమరావతి పై అనేక ఆరోపణలు చేసారు. ఒక్కటి నిరూపించలేకపోయారు.

అమరావతి వైట్ పేపర్. అక్కడ వైసిపి అక్రమాలు చెల్లవు. సీఆర్డీఏ చట్టం ఉంది. అందుకే ఉత్తరాంధ్ర ని దోచుకోవడానికి స్కెచ్ వేసారు. విజయసాయి రెడ్డి దస్పల్లా భూములు దోచుకుంటే. ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూర్మన్నపాలెం లో భూకబ్జా. మంత్రి ధర్మాన సైనికులకు చెందిన 71 ఎకరాలు కొట్టేసారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.