భయం గుప్పిట్లో చింతలాయపల్లి..

కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త మంజుల సుబ్బారావు దారుణ హత్యతో కొలిమిగుండ్ల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చింతలాయపల్లి గ్రామస్తులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. ఎటు చూసినా గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు పహారా కొనసాగుతోంది. ఇటు హత్యకు గురైన సుబ్బారావు ఇంటివద్ద, అటు హత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్న అనుమానితుల ఇళ్ల వద్ద కూడా పోలీసు కాపాల కొనసాగుతోంది. సుమారు 40 మంది పోలీసులు గ్రామంలోని పలు చోట్ల పహారా కాస్తున్నారు. కోయిలకుంట్ల […]

భయం గుప్పిట్లో చింతలాయపల్లి..
Follow us

|

Updated on: Dec 18, 2019 | 8:04 PM

కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త మంజుల సుబ్బారావు దారుణ హత్యతో కొలిమిగుండ్ల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చింతలాయపల్లి గ్రామస్తులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. ఎటు చూసినా గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు పహారా కొనసాగుతోంది. ఇటు హత్యకు గురైన సుబ్బారావు ఇంటివద్ద, అటు హత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్న అనుమానితుల ఇళ్ల వద్ద కూడా పోలీసు కాపాల కొనసాగుతోంది. సుమారు 40 మంది పోలీసులు గ్రామంలోని పలు చోట్ల పహారా కాస్తున్నారు. కోయిలకుంట్ల సీఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసుల పికెటింగ్ కొనసాగుతోంది. బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండల పరిధిలోగల బెలుం గుహల వద్ద టీడీపీ నాయకుడు సుబ్బారావు అనే వ్యక్తి ఈ నెల 17న దారుణహత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు అతన్ని వేటకొడవళ్లతో నరికి, ఆపై బండలతో మోది చంపారు. మృతుడు సుబ్బారావు స్వగ్రామం చింతలాయపల్లి. ఇతను తాడిపత్రి పట్టణ పరిధిలో గ్రానైట్ వ్యాపారంతో పాటు, గ్రానైట్ గుండ్ల లారీల యజమానిగా గుర్తింపు పొందారు. ఇతను మొదట తాడిపత్రి తెలుగుదేశం నాయకునిగా చలామణి అయి ఆ తర్వాత వైసిపి నాయకులతో సన్నిహితునిగా మెలుగుతూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత టిడిపిలో చేరి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అనుచరునిగా కొనసాగారు. ఇక చింతలాయపల్లి టిడిపి పార్టీకి నాయకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక వైసిపి నాయకులు గురివిరెడ్డి మధ్య రాజకీయ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. టిడిపి కార్యకర్త సుబ్బారావు హత్య కేసులో నిందితులను ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించామని సిఐ తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనంతపురం, కడప జిల్లాల్లో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హత్యతో సంబంధం ఉన్న వారు ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హత్యకు గురైన మంజుల సుబ్బారావు ఫ్యాక్షన్ నేపథ్యం లేదని అతని పై ఎటువంటి కేసులు కూడా లేవని రాజకీయంగా అడ్డు వస్తాడనే ఉద్దేశ్యంతోనే మంజుల సుబ్బారావు ను అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సిఐ తెలిపారు. సుబ్బారావు అంత్యక్రియలు ఉద్రిక్త వాతావరణంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బుధవారం పూర్తయ్యాయి. సుబ్బారావు తాడిపత్రిలో నివాసం ఉంటుండడంతో అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన టిడిపి పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి బంధువులను ఓదార్చారు. అంతిమ యాత్రలో బంధువులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకనే బీసీ వర్గానికి చెందిన సుబ్బారావు ను దారుణంగా హత్య చేశారని వారు ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేక గ్రామాల్లో ఫ్యాక్షన్ పడగ విప్పే ప్రమాదం ఉంది.. గ్రామ ఆదిపత్యం కోసం టిడిపి వైసిపి నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుండటం పోలీసు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మొత్తం మీద బనగానపల్లె నియోజకవర్గం లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిందని తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం