జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన‌ అనుచ‌రుడు మృతి

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు ర‌షీద్‌ మృతి చెందాడు. ఆదివారం అనారోగ్యంతో ఆయ‌న క‌న్నుమూశాడు. కాగా 2018 డిసెంబ‌ర్ 30న ర‌షీద్‌ను అరెస్ట్ చేసేందుకు వైఎస్సార్ క‌డప జిల్లాకు చెందిన అప్ప‌టి సీఐ హ‌మీద్ కాన్ త‌న సిబ్బందితో క‌లిసి...

  • Tv9 Telugu
  • Publish Date - 1:18 pm, Mon, 10 August 20
జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన‌ అనుచ‌రుడు మృతి

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు ర‌షీద్‌ మృతి చెందాడు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ ఆయ‌న ఆదివారం ఉద‌యం క‌న్నుమూశాడు. కాగా 2018 డిసెంబ‌ర్ 30న ర‌షీద్‌ను అరెస్ట్ చేసేందుకు వైఎస్సార్ క‌డప జిల్లాకు చెందిన అప్ప‌టి సీఐ హ‌మీద్ కాన్ త‌న సిబ్బందితో క‌లిసి తాడిప‌త్రికి చేరుకున్నారు. అయితే అత‌నితో పాటు అనుచ‌రులు కూడా క‌లిసి సీఐ హ‌మీద్ ఖాన్‌, ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్ల‌పై దాడుల‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ర‌షీద్‌ను క‌డ‌ప జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. బెయిల్‌పై విడుద‌ల‌యిన‌ ర‌షీద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప‌లు కేసుల్లో నిందితుడిగా ఉన్న ర‌షీద్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు.

Read More: 

14 ఏళ్ల త‌ర్వాత దొరికిన ప‌ర్సు.. అవాక్క‌యిన వ్య‌క్తి