TDP: టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు.. విజయవాడ రమేష్‌ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు వచ్చింది. అర్ధరాత్రి హార్ట్‌ ఎటాక్‌ రావడంతో విజయవాడ రమేష్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

TDP: టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు.. విజయవాడ రమేష్‌ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
Batchula Arjunudu
Follow us

|

Updated on: Jan 29, 2023 | 9:34 AM

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనతో ఉన్న తెలుగు తమ్ముళ్లకు మరో చేదు వార్త వినిపించింది. గన్నవరం టీడీపీ సీనియర్‌ లీడర్‌ ఆస్పత్రిపాలయ్యారు. గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా గుండెనొప్పిరావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. బచ్చుల అర్జునుడుకి ప్రస్తుతం స్టంట్ వేశారు. అయితే, బచ్చుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెబుతున్నారు వైద్యులు. బచ్చుల అర్జునుడి విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు, వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ ముఖ్యనేతలు రమేశ్ ఆస్పత్రికి చేరుకుని బచ్చుల ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

బచ్చులకు గుండెపోటు రావడం ఇది రెండో సారి. 2021లోనూ బచ్చుల గుండెపోటుకు గురయ్యారు. అప్పుడు కూడా రమేశ్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అత్యవసర శస్త్రచికిత్స అందించడంతో గతంలో ప్రాణాపాయం తప్పింది. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది.

అయితే ఇవాళ తెల్లవారుజామున మరోసారి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమంయలో కరోనా  రెండుసార్లు సోకిందని తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేదని సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం