Nara Lokesh: సొంత చెల్లికే న్యాయం చేయలేదు.. ఇక జనానికేం చేస్తారు.. సీఎం జగన్‌పై నారా లోకేష్ విమర్శనాస్త్రాలు

మరోసారి బెజవాడలో పొలిటికల్‌ హైడ్రామా చోటుచేసుకుంది. ఏపీలో అరాచక పాలన సాగుతోందని పరామర్శలకు వస్తే కూడా అడ్డుకుంటున్నారని తెలుగు దేశం పార్టీ ఆరోపించింది.

Nara Lokesh: సొంత చెల్లికే న్యాయం చేయలేదు.. ఇక జనానికేం చేస్తారు.. సీఎం జగన్‌పై నారా లోకేష్ విమర్శనాస్త్రాలు
Nara Lokesh
Follow us

|

Updated on: Sep 09, 2021 | 6:32 PM

Nara Lokesh fire on AP CM Jagan: మరోసారి బెజవాడలో పొలిటికల్‌ హైడ్రామా చోటుచేసుకుంది. ఏపీలో అరాచక పాలన సాగుతోందని పరామర్శలకు వస్తే కూడా అడ్డుకుంటున్నారని తెలుగు దేశం పార్టీ ఆరోపించింది. రాజకీయ ఎజెండా పెట్టుకుని వస్తే అనుమతి ఎలా ఇస్తారంటోంది అధికార వైసీపీ. అనుమతి లేకపోయినా వచ్చి రచ్చ చేసిందే టీడీపీనే అని మంత్రులు మండిపడ్డారు.

నర్సరావుపేటలో ప్రేమోన్మాది బాధితురాలు అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శలకు కూడా అనుమతి కావాలా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు నారా లోకేష్‌. ముందే అనుమతి నిరాకరించామని పోలీసులు క్లారిటీ ఇచ్చినా వెనక్కు తగ్గలేదు. ముందుకు వెళ్లేందుకు లోకేశ్‌ ప్రయత్నించడంతో పోలీసులతో స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది. అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చారని పోలీసులు పేర్కొంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అనుమతి లేకపోవడంతో ఆయన్ను అక్కడి నుంచి దుర్గమ్మ వారధి మీదుగా ఉండవల్లి తీసుకెళ్లి చివరకు ఇంటివద్ద దింపారు పోలీసులు.

ఏపీలో అరాచకపాలన సాగుతోందని.. దిశ చట్టం అమలు చేస్తున్నామన్న ప్రభుత్వం అత్యాచార బాధితులు ఎంతమందికి న్యాయం చేశారని నిలదీస్తోంది తెలుగుదేశం పార్టీ . పైగా బాధితులకు అండగా ఉంటే అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు తమ్ముళ్లు. రమ్యను హతమార్చిన దోషులను శిక్షించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. 21 రోజులు అయ్యింది.. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు లోకేష్, నర్సరావుపేటకు వెళ్లకుండా.. నన్ను అడ్డుకోవడానికి 3 వేలమందితో పోలీసుల బందోబస్తు పెట్టారన్నారు. రాష్ట్రంలో లేని దిశ చట్టానికి 30 కోట్ల యాడ్స్ ఇచ్చారన్నారు లోకేష్.

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని లోకేష్ ఆరోపించారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని సీఎం జగన్‌, ప్రజలకేం చేస్తారు? అని టీడీపీ నేత నారా లోకేష్‌ ప్రశ్నించారు. జగన్ నివాసం సమీపంలోనే మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగిన దిక్కులేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లేని దిశ చట్టాన్ని ఉందని మహిళలను వైసీపీ మోసం చేస్తోందని దుయ్యబట్టారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా.. వైసీపీ మేలుకోవడం లేదని తప్పుబట్టారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు న్యాయం చేయలేదని లోకేష్ ధ్వజమెత్తారు.

లేని దిశ చట్టాన్ని ఉందని మహిళలను వైసీపీ మోసం చేస్తోందని దుయ్యబట్టారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా.. వైసీపీ మేలుకోవడం లేదని తప్పుబట్టారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు న్యాయం చేయలేదని లోకేష్ తెలిపారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 517 మంది మహిళలపై దాడులు జరిగాయన్న లోకేష్.. ఇప్పటివరకు ఏ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. మహిళలను వైసీపీ నేతలు అడుగడుగునా అవమానిస్తున్నారు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను హింసిస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో మా పోరాటాన్ని ఆపలేరు. మొత్తం 517 బాధిత కుటుంబాలను కలిసి తీరుతా’’ అని లోకేష్‌ ప్రకటించారు.

మరోవైపు, ఎజెండా ఏమీ లేకపోవడంతో సున్నిత అంశాలను తెరమీదకు తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారంటోందని అధికార పార్టీ వైసీపీ. నెలల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు పరామర్శలేంటని రాష్ట్ర మంత్రులు నిలదీశారు. పొలిటికల్ ఎజెండా పెట్టుకుని చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్న డ్రామా అని వైసీపీ నేతలు విమర్శించారు. మహిళల భద్రతలో ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. టీడీపీలో కూడా లోకేశ్‌ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని చెప్పారు. అందుకే ఇలాంటి డ్రామాలు అని పేర్కొన్నారు.

Read Also… Vinayaka Chavithi: వినాయక చవితి జరుపుకుంటే చదువు వస్తుంది.. ఉత్సవాలకు అనుమతి ఇవ్వమని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు చిన్నారులు..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..