వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడి యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు

గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్త దాడికి యత్నించాడు. గురువారం రాత్రి గం.10.30 సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని

  • Tv9 Telugu
  • Publish Date - 11:27 am, Fri, 16 October 20
వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడి యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు

MP Nandigam Suresh: గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్త దాడికి యత్నించాడు. గురువారం రాత్రి గం.10.30 సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటి నుంచి ఎంపీ కారులో బయల్దేరారు. ఆ సమయంలో తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావు అనే వ్యక్తి  ఎదురుగా వచ్చి తన బైక్‌ను అడ్డుపెట్టి అసభ్య పదజాలంతో దూషించాడు.

దీంతో ఎవరని ప్రశ్నించగా.. సురేష్‌పై దాడి చేసేందుకు మీదకు రావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతడిని పట్టుకొని భద్రతా సిబ్బంది వెతగ్గా.. ఇనుప రాడ్డు బయటపడింది. వెంటనే నిందితుడు సమీపంలోని అమరావతి జేఏసీ నాయకుడు పులి చిన్న ఇంట్లోకి పారిపోయాడు. ఆ తరువాత అతడిని భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎంపీ సురేష్‌ మాట్లాడుతూ.. మద్యం మత్తులో ఉన్న పూర్ణచంద్రరావు తనపై దాడికి యత్నించాడని తెలిపారు.

Read More:

‘ఒక్కడు’, ’96’ మూవీల్లో సేమ్‌ సీన్లు.. వీడియో పోస్ట్ చేసిన త్రిష

‘కేజీఎఫ్ 2’.. సంజయ్ పాత్ర కోసం ‘ప్లాన్‌ బి’