టీడీపీ నేత నారాయణపై స్టూడెంట్స్ దాడి..ఉద్రిక్తత

ఏపీలో టీడీపీ నేతలకు వరస అవమానాలు ఎదురవుతున్నాయి. ఇటీవల అమరావతిలో రైతులు, రాయలసీమలో విద్యార్థి సంఘాలు పార్టీ అధినేత  చంద్రబాబును అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటనలపై ఇంకా వివాదం నడుస్తుండగానే..తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణకు నిరసన సెగ తగిలింది. అనంతపురం పర్యటనలో ఉన్న మాజీ మంత్రిని పలువురు విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులతో నారాయణ సంస్థలు స్టూడెంట్స్ జీవితాలతో […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:27 pm, Tue, 3 December 19
టీడీపీ నేత నారాయణపై స్టూడెంట్స్ దాడి..ఉద్రిక్తత

ఏపీలో టీడీపీ నేతలకు వరస అవమానాలు ఎదురవుతున్నాయి. ఇటీవల అమరావతిలో రైతులు, రాయలసీమలో విద్యార్థి సంఘాలు పార్టీ అధినేత  చంద్రబాబును అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటనలపై ఇంకా వివాదం నడుస్తుండగానే..తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణకు నిరసన సెగ తగిలింది. అనంతపురం పర్యటనలో ఉన్న మాజీ మంత్రిని పలువురు విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులతో నారాయణ సంస్థలు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.  దీంతో నారాయణ అనుచరులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.

ఈ ఘర్షణలో నారాయణ చొక్కా చినిగిపోయినట్టు సమాచారం. కారు అద్దాలు కూడా స్పల్పంగా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. దీంతో నారాయణ తన పర్యటనను హఠాత్తుగా రద్దు చేసుకున్నారు.