Mysterious: ఆ గ్రామంలో వింత శబ్దాలు.. నిద్రలేకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న జనం..

Strange Sounds in Village: అక్కడి జనానికి రోజు నిద్ర ఉండదు. పగలైనా...రాత్రైనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. కారణం ఏమిటో తెలియక..అయోమయంలో బతుకున్నారు. ఇంతకీ

Mysterious: ఆ గ్రామంలో వింత శబ్దాలు.. నిద్రలేకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న జనం..
Madirebailu Village
Follow us

|

Updated on: Nov 25, 2021 | 10:23 AM

Strange Sounds in Village: అక్కడి జనానికి రోజు నిద్ర ఉండదు. పగలైనా…రాత్రైనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. కారణం ఏమిటో తెలియక..అయోమయంలో బతుకున్నారు. ఇంతకీ ఆ ఊరికేమైందో ఇప్పుడు తెలుసుకుందాం.. చూడటానికి పచ్చగా కనిపిస్తున్న ఈ పల్లెటూరి పేరు మదిరేబైలు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో ఉన్న ఓ చిన్న గ్రామం. కొద్దిరోజుల క్రితం వరకు ఇక్కడి వాళ్లంతా ఆనందంగా జీవించారు. కానీ ఇప్పుడు కొన్ని రోజులనుంచి భయంతో వణికిపోతున్నారు. ఏక్షణాన ఏం జరుగుతుందో…ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం విరుచుకుపడుతుందోనన్న భయం గ్రామస్తుల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ మాట ఎందుకంటున్నామంటే…ఈఊళ్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఆకాశం నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు రావడం, భూమి బద్దలైనట్లుగా.. భూమి కంపించడం వంటి ధ్వనులతో అంతా హడలిపోతున్నారు.

ఆకాశం నుంచి వచ్చే శబ్ధాలు వింటుంటే…ఏవైనా మీద పడతాయేమోనన్న అనుమానపడుతున్నారు. భూమి నుంచి వచ్చే సౌండ్‌తో భూకంపం ఏమైనా వస్తుందా అని డౌట్ పడుతున్నారు. ఈ సందేహాలతోనే రాత్రి వేళ గ్రామస్తులు ఎవరూ నిద్రకూడా పోకుండా జాగారం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులైతే ఈ శబ్ధాలకు మరింత ఆందోళన చెందుతున్నారు. ఓ పాత ఇల్లు కూలిపోవడం, ఇంట్లోని వస్తువులు కిందపడటం వంటి వాటిని ఉదాహరిస్తున్నారు.

ఈ మధ్యనే కురిసిన భారీ వర్షాలతో మదిరేబైలు గ్రామస్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో శబ్ధాలు రావడానికి కారణాలు గుర్తించి…గ్రామస్తుల్లో ధైర్యం నింపాలని కోరుతున్నారు. ఈ శబ్దాలకు ఇళ్లు సైతం ధ్వంసమవుతున్నాయని పేర్కొంటున్నారు. దీంతో గ్రామస్థులు రాత్రి పూట జాగారం చేస్తూ గడుపుతున్నారు.

Also Read

India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలంటే..?

Winter Care Tips: స్కిన్ టోన్‌ను బట్టి సరైన ఫేస్ క్రీమ్‌.. శీతాకాలంలో ఏదో ఒకటి ఎంచుకోవద్దు.. సమస్యలు కొని తెచ్చుకోద్దు..

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్