Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే

Makar Sankranti Special Trains: ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
Trains
Follow us

|

Updated on: Dec 25, 2021 | 1:54 PM

Makar Sankranti Special Trains: ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శుక్రవారం వెల్లడించింది.

సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు.. ➼ 07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు) ➼ 07455 నర్సాపూర్‌- సికింద్రాబాద్‌ (2, 9, 16, 23, 30 తేదీల్లో) ➼ 07456సికింద్రాబాద్‌-విజయవాడ (3,10,17, 24, 31 తేదీల్లో) ➼ 07577 మచిలీపట్నం-సికింద్రాబాద్‌ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30 తేదీల్లో) ➼ 07578 సికింద్రాబాద్‌-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30 తేదీల్లో) ➼ 07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28 తేదీల్లో) ➼ 07606 అకోలా-తిరుపతి (9, 16, 23, 30 తేదీల్లో) ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది.

Also Read:

Webb Space Telescope: మూడు దశాబ్దాల కలకు టైం ఫిక్స్.. నేడే నింగిలోకి వెబ్‌ టెలిస్కోప్‌..

Punjab Elections 2022: సారధి లేకుండానే బరిలోకి కాంగ్రెస్.. పంజాబ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు..

Assembly Elections: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపాలా? వద్దా?.. కేంద్ర ఎన్నికల సంఘం తర్జన భర్జన..