Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రద్దీ నేపథ్యంలో విజయవాడ-చెన్నై మధ్య స్పెషల్ ట్రైన్

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రద్దీ నేపథ్యంలో విజయవాడ-చెన్నై మధ్య స్పెషల్ ట్రైన్
South Central Railway
Follow us

|

Updated on: Nov 23, 2021 | 1:48 PM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దీ నేపథ్యంలో విజయవాడ-చెన్నై మధ్య ఈ ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 3:20 కి విజయవాడ నుండి బయలుదేరనున్నట్లుగా  వెల్లడిచారు. న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావాలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరు పేట ల్లో ఈ  స్పెషల్ ట్రైన్ ఆగనుందని తెలిపారు. రాయల సీమలో కొనసాగుతున్న వరదల నేపథ్యంలో విజయవాడ-చెన్నై మార్గంలో చిక్కుకున్న ప్రయాణీకుల రద్దీ ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు (07443)నడపనుంది.

ఈరోజు మధ్యాహ్నం 3:20కి విజయవాడ నుండి బయలుదేరనున్న ఈ రైలు న్యూ గుంటూరు,తెనాలి,చీరాల,ఒంగోలు, కావాలి,నెల్లూరు, గూడూరు,నాయుడుపేట,సూళ్లూరు పేట ల్లో ఆగనుంది. ఈ స్పెషల్ రైలు రాత్రి 10:30కు చెన్నై చేరుకోనుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఇక మరోవైపు ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బికనీర్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇది మంగళవారం సాయంత్రం 07.35 గం.లకు బికనీర్ నుంచి బయలుదేరి గురువారంనాడు ఉదయం 11 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.

అలాగే మంగళవారంనాడు నడిచే చెన్నై సెంట్రల్ – సీఎస్టీ ముంబై, చెన్నై సెంట్రల్ – ఎల్‌టీటీ ముంబై, సీఎస్‌టీ ముంబై – చెన్నై సెంట్రల్, ఎల్‌టీటీ ముంబై – చెన్నై సెంట్రల్, బిలాస్‌పూర్ – తిరునెల్వేలి రైళ్లు రద్దయ్యాయి. అలాగే బుధవారంనాడు బయలుదేరాల్సిన గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ రైలును రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి: YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో సంచలన నిజాలు.. సొంత అల్లుడిపైనే అనుమానాలు..

Winter Makeup Tips: కాలం మారింది.. మేకప్ కిట్‌లో ఈ నాలుగు మార్పులు చేసుకోండి..