వైఎస్ వివేకా హత్యకేసు… దూకుడు పెంచిన సిట్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ సీబీఐ విచారణ చేయాలని పట్టుబట్టారు. టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ నిందితులు ఎవరూ పట్టుబడలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ హత్యకేసులో సిట్ దూకుడు పెంచింది. మూడు రోజులుగా రోజూ విచారణ చేపట్టిన సిట్ అధికారులు వైఎస్ కుటుంబ సభ్యులతో పటు పలువురిని విచారించి వారి […]

వైఎస్ వివేకా హత్యకేసు... దూకుడు పెంచిన సిట్!
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2019 | 5:22 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ సీబీఐ విచారణ చేయాలని పట్టుబట్టారు. టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ నిందితులు ఎవరూ పట్టుబడలేదు.

అయితే మళ్ళీ ఇప్పుడు ఈ హత్యకేసులో సిట్ దూకుడు పెంచింది. మూడు రోజులుగా రోజూ విచారణ చేపట్టిన సిట్ అధికారులు వైఎస్ కుటుంబ సభ్యులతో పటు పలువురిని విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. టీడీపీ నేత ఎమ్మెల్సీ బీటెక్ రవి, సింహాద్రిపురం మండలానికి చెందిన కొమ్మా పరమేశ్వర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. దర్యాప్తునకు సహకరిస్తామని హామీ ఇచ్చారు బీటెక్ రవి. అలాగే ఆది నారాయణరెడ్డి సోదరుడు కూడా విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. కడప శివారులోని డీటీసీ లో సిట్ విచారణ జరుగుతోంది. ఈ విచారణ మరో వారం రోజులపాటు కొనసాగనున్నట్లు సమాచారం.

సిట్ అధికారులు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డ్రైవర్ దస్తగిరి, ప్రకాష్‌ను ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు. కాగా.. ఇప్పటివరకు 1300 మంది అనుమానితులను ప్రశ్నించినట్టు అధికారులు తెలిపారు.