వివేకా హత్యకేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్.. విచారణకు రానున్న..!

వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తులో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు సిట్ విచారణకు హాజరుకాని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.. బుధవారం జరిగే సిట్ విచారణకు హాజరుకాబోతున్నట్లు సమాచారం. కాగా.. సిట్ విచారణకు హాజరు కావాలని.. సీఆర్పీసీ 160 కింద పలుమార్లు ఆదేశాలు జారీచేసినా.. సెక్షన్ 41ఏ కింద అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో.. తాను అందుబాటులో లేనంటూ సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. అయితే తాజాగా.. న్యాయసలహా తీసుకున్న అనంతరం.. సిట్ విచారణకు హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లు […]

వివేకా హత్యకేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్.. విచారణకు రానున్న..!
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2019 | 4:18 PM

వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తులో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు సిట్ విచారణకు హాజరుకాని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.. బుధవారం జరిగే సిట్ విచారణకు హాజరుకాబోతున్నట్లు సమాచారం. కాగా.. సిట్ విచారణకు హాజరు కావాలని.. సీఆర్పీసీ 160 కింద పలుమార్లు ఆదేశాలు జారీచేసినా.. సెక్షన్ 41ఏ కింద అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో.. తాను అందుబాటులో లేనంటూ సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. అయితే తాజాగా.. న్యాయసలహా తీసుకున్న అనంతరం.. సిట్ విచారణకు హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అనేక మలుపులు తిరిగిన వివేకా హత్యకేసు విచరాణ.. ఇప్పుడు కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్ వివేకా హత్య.. ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపింది. వైఎస్ వివేకానందరెడ్డి.. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డికి తమ్ముడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌కి స్వయంగా బాబాయి. అంతేకాదు.. మాజీ మంత్రి కూడా.. హత్యజరిగి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. అన్నది ఇప్పటికీ తేలలేదు. ఈ క్రమంలో సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. కడప డీటీసీలో వారం రోజులుగా.. 160 మందిని విచారించింది. వీరిలో వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు.. వివేకా వద్ద పనిచేసిన వారిని.. టీడీపీ నేతలు ఎమ్మెల్సీ బీటెక్ రవితో సహా మరికొందరిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేసుకుంది. ఈ విచారణలో భాగంగా మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆది విచారణకు హాజరు కాకపోవడంతో సిట్ అధికారులు 160 CRPC కింద నోటీసులు జారీచేశారు.. ఈ పరిణామాల మధ్య.. బుధవారం సిట్ విచారణకు హాజరు కావాలని ఆదినారాయణ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ వివేకా, బీటెక్ రవి పోటీచేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి.. వివేకా హత్యకు గురయ్యేంతవరకు జరిగిన పరిణామాలపై.. సిట్ అధికారులు ఆదినారాయణ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.