ఏపీ : పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన ఎస్సై…

ఏపీ : పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన ఎస్సై...

ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభ స‌మయంలో ప్రంట్ లైన్ లో ఉండి విధులు నిర్వ‌ర్తిస్తూ..రియ‌ల్ హీరోలుగా నిలుస్తున్నారు పోలీసులు. అయితే వారిలో కొంద‌రు చేసే త‌ప్పుడు ప‌నులు వ‌ల్ల డిపార్ట్ మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వ‌స్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ ఎస్సై పేకాటాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. వెంకాయపల్లె కొత్త కాలనీలోని ఓ ఇంట్లో కార్డ్స్ ఆడుతున్నట్లు పోలీసులకు ఇన్ప‌ర్మేష‌న్ అందింది. వెంటనే అల‌ర్ట‌యిన‌ పోలీసులు..స్ఠావ‌రంపై దాడులు చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. […]

Ram Naramaneni

|

May 09, 2020 | 4:03 PM

ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభ స‌మయంలో ప్రంట్ లైన్ లో ఉండి విధులు నిర్వ‌ర్తిస్తూ..రియ‌ల్ హీరోలుగా నిలుస్తున్నారు పోలీసులు. అయితే వారిలో కొంద‌రు చేసే త‌ప్పుడు ప‌నులు వ‌ల్ల డిపార్ట్ మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వ‌స్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ ఎస్సై పేకాటాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. వెంకాయపల్లె కొత్త కాలనీలోని ఓ ఇంట్లో కార్డ్స్ ఆడుతున్నట్లు పోలీసులకు ఇన్ప‌ర్మేష‌న్ అందింది. వెంటనే అల‌ర్ట‌యిన‌ పోలీసులు..స్ఠావ‌రంపై దాడులు చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సీఐడీలో పనిచేస్తున్న ఎస్సై కూడా ఉన్నట్లు గుర్తించారు. పేకాట రాయుళ్ల దగ్గర నుంచి రూ.60 వేల డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసులు…కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రోవైపు తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి, మలికిపురం మండల్లాలోని పేకాట శిబిరాల‌పై పోలీసులు దాడి చేశారు. పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారిని నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌‌డౌన్ కావడంతో పేకాట, కోడిపందాలు జోరుగా జరుగుతున్నాయి. పోలీసులంతా లాక్‌డౌన్‌ విధుల్లో బిజీగా ఉండటంతో ఇదే అదునుగా భావించి…పందెంరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ఇలాంటి వాటి వ‌ల్ల కూడా క‌రోనా వ్యాప్తి చెందిన ఘ‌ట‌న‌లు రీసెంట్ గా చాలా వెలుగుచూసిన విష‌యం తెలిసిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu