శాంతాబయోటెక్‌ ఫార్మా కంపెనీ చైర్మన్‌ భారీ విరాళం.. ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం అందించిన కేఈ వరప్రసాద్‌రెడ్డి

దేశంలో ప్రముఖ ఫార్మా కంపెనీల్లో శాంతా బయోటెక్ ఒకటి. హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న ఈ కంపెనీ ఎన్నో విజయవంతమైనా టీకాలను..

  • K Sammaiah
  • Publish Date - 3:30 pm, Fri, 22 January 21
శాంతాబయోటెక్‌ ఫార్మా కంపెనీ చైర్మన్‌  భారీ విరాళం.. ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం అందించిన కేఈ వరప్రసాద్‌రెడ్డి

దేశంలో ప్రముఖ ఫార్మా కంపెనీల్లో శాంతా బయోటెక్ ఒకటి. హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న ఈ కంపెనీ ఎన్నో విజయవంతమైనా టీకాలను అభివృద్ధి చేసింది. మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన హెపటైటిస్-బి వ్యాధికి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా టీకాలను తీసుకువచ్చింది శాంతా బయోటెక్ ఫార్మా సంస్థే.

శాంతా బయోటెక్‌ ఫార్మా కంపెనీకి అధిపతి తెలుగువాడైన కేఈ వరప్రసాద్ రెడ్డి. ఆయన తాజాగా శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ట్రస్టుకు భారీ విరాళం ప్రకటించారు. ఆ మేరకు కోటి రూపాయల డీడీని ఆయన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందించారు. శ్రీవారి దర్శనానికి సతీసమేతంగా వచ్చిన ఆయన శ్రీవారి సన్నిధిలో డీడీని అందజేశారు.