తెలంగాణ రాష్ట్రానికి ఏడు జాతీయ స్థాయి అవార్డ్స్..

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మరోసారి అరుదైన ఘనత సాధించింది. ఏకంగా ఏడు జాతీయస్థాయి అవార్డులను సొంతం చేసుకుంది. ప్రతీ ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తమ గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాల పేరిట అవార్డులను...

తెలంగాణ రాష్ట్రానికి ఏడు జాతీయ స్థాయి అవార్డ్స్..
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 12:52 PM

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మరోసారి అరుదైన ఘనత సాధించింది. ఏకంగా ఏడు జాతీయస్థాయి అవార్డులను సొంతం చేసుకుంది. ప్రతీ ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తమ గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాల పేరిట అవార్డులను ప్రకటిస్తుంది. ఈ మేరకు వివిధ విభాగాల్లో రాష్ట్రానికి ఏడు అవార్డులు వచ్చాయి. కేంద్రం ప్రకటించిన అన్ని కేటగిరీల్లోనూ తెలంగాణ హవా కొనసాగించింది. ఈ అవార్డులు సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడు అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

మధ్యస్థ పంచాయతీ అవార్డులకు పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం ఎంపికయ్యాయి. పంచాయతీ స్థాయిలో పెద్దపల్లి జిల్లాలోని కిష్టం పేట, సిద్ధిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలంలో గుర్రాలగొంది, సిద్ధిపేట రూరల్ మండలంలోని పెద్దలింగారడ్డిపల్లి, భూపాలపల్లి జిల్లాలోని గంగారం గ్రామాలకు అవార్డులు లభించాయి. ఈ నెల 21, 22న కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డును ఆయా గ్రామాల సర్పంచులు అందుకోనున్నారు. మంగళవారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సంజీబ్ పత్ జోషీ అవార్డులను ప్రకటించారు.

Read More: 

షాకింగ్: ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా ముప్పు.. నిపుణుల రిపోర్ట్

డిప్రెషన్‌కూ ‘ఇన్సూరెన్స్’.. సుప్రీం నోటీసులు

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..