ఏపీ ఎన్నికల బరిలో బిగ్ బాస్ కంటెస్టెంట్

నూజివీడు: కృష్ణ జిల్లా నూజివీడు అసెంబ్లీ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన బరిలోకి దిగుతున్నారు. ఆమె నూజీవీడు అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే సంజన నూజీవీడు నుంచి పోటీ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే… ఆమె దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు దగ్గర బంధువు. ఇకపోతే ఆమె నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామంలో జన్మించింది. సాయి సంజన అసలు […]

ఏపీ ఎన్నికల బరిలో బిగ్ బాస్ కంటెస్టెంట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 7:57 PM

నూజివీడు: కృష్ణ జిల్లా నూజివీడు అసెంబ్లీ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన బరిలోకి దిగుతున్నారు. ఆమె నూజీవీడు అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే సంజన నూజీవీడు నుంచి పోటీ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే… ఆమె దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు దగ్గర బంధువు.
ఇకపోతే ఆమె నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామంలో జన్మించింది. సాయి సంజన అసలు పేరు అన్నే వనజ. ఆమె తండ్రి ధన కోటేశ్వరరావు అక్కడ ఒక రైతు. మొదటి నుంచి ప్రజాసేవ మీద ఆసక్తి చూపించే సంజన కొద్ది రోజుల క్రిందట జనజాగృతి పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నూజీవీడు అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించిన సంజన.. టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నూజివీడు అసెంబ్లీ బరిలో పోటీచేస్తున్నారు.