Andhra: ఓం నమ: శివాయ.. నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న పంచ అఖండ జోత్యులు

గుంటూరు జిల్లా పొన్నూరులోని సహస్రలింగేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ దేవాలయంలో 1961లో జగన్నాథ స్వామి పంచ అఖండ జ్యోతులను ప్రతిష్టించారు. పంచభూతాల ప్రతీకగా ఏర్పాటు చేసిన అగ్ని, జల, వాయు, ఆకాశ, పృథ్వి జ్యోతులు నలభై ఏళ్లుగా నిర్విఘ్నంగా వెలుగుతూనే ఉన్నాయి.

Andhra: ఓం నమ: శివాయ.. నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న పంచ అఖండ జోత్యులు
Eternal Lamp

Edited By: Ram Naramaneni

Updated on: Dec 09, 2025 | 5:37 PM

గుంటూరు జిల్లా పొన్నూరులో సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు ఉన్నాడు. తర్వాత కాలంలో ఆంజనేయస్వామి వారిని ఇక్కడ ప్రతిష్టించారు. సహస్రలింగేశ్వరస్వామి వారి ఆలయంలో 1961లో జగన్నాథ స్వామి పంచ అఖండ జ్యోతులను ప్రారంభించారు. శివ భక్తుల కోరిక మేరకు అఖండ జ్యోతిని స్వామి వారు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలయంలో ఒక్క జ్యోతి కాకుండా పంచ భూతముల పేరుతో ఐదు అఖండ జ్యోతులను ఏర్పాటు చేశారు. నలభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అఖండ జ్యోతులు నిర్విఘ్నంగా వెలుగుతూనే ఉన్నాయి. ఈ జ్యోతులు ఆరిపోకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి జ్యోతికి స్థంభాలు నిర్మించి పరిరక్షిస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు వచ్చినా.. మూడు పూటల జ్యోతులకు ఆవు నెయ్యి వడ్డిస్తారు. దీంతో జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. ఇందుకోసం జగన్నాథ స్వామి ఆశ్రమ ట్రస్ట్ పనిచేస్తుంది.

సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా అగ్ని జ్యోతి.. మహా విష్ణువు ఆలయం ఎదురుగా జల జ్యోతి.. ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా వాయు జ్యోతి.. కాలభైరవ స్వామి వారి ఆలయం ఎదురుగా ఆకాశ జ్యోతి.. గరుత్ముంతుని ఎదురుగా పృథ్వి జ్యోతులను ఏర్పాటు చేశారు. జగన్నాథ స్వామి తన యోగ అభ్యాసన ద్వారా, తన జ్ఞానం ద్వారా జ్యోతులను వెలిగించినట్లు భక్తులు చెబుతున్నారు. మానవ సమాజం క్షేమంగా ఉండాలంటే పంచ భూతాలు ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంటారు. ఈ పంచ జ్యోతులు వెలుగుతున్నంత కాలం ఎటువంటి కష్టానష్టాలు దరి చేరవని ప్రజలంతా పాడిపంటలు, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా ఉంటారని అనుకుంటారు. ఈక్రమంలోనే గత నలభై ఏళ్లుగా జ్యోతులు నిర్విఘ్నంగా వెలుగుతూనే ఉన్నాయి. మూడు షిఫ్టుల్లో ఆవు నెయ్యి వడ్డిస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా పూజారుల నియమించారు. వారే జ్యోతులు కొండక్కెకుండా చూస్తుంటారు.

మరినని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..