జీవిత ఖైదు మహిళల విషయంలో.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

జీవిత ఖైదు పడ్డ మహిళా ఖైదీల విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు జైలు శిక్ష పూర్తైన మహిళా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది

జీవిత ఖైదు మహిళల విషయంలో.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Nov 06, 2020 | 9:52 AM

Andhra Pradesh Government: జీవిత ఖైదు పడ్డ మహిళా ఖైదీల విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు జైలు శిక్ష పూర్తైన మహిళా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ మార్గదర్శకాలను విడుదల చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళా జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ( అంబులెన్స్‌కి దారి క్లియర్ చేసేందుకు 2కి.మీలు పరిగెత్తిన పోలీస్‌.. వీడియో వైరల్‌)

అంతేకాదు దీనికి సంబంధించిన కసరత్తుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అందులో చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(హోంశాఖ), సభ్యులుగా ప్రభుత్వ కార్యదర్శి(లీగల్‌ అండ్‌ లెజిస్లేటివ్‌ అఫైర్స్‌ అండ్‌ జస్టిస్, లా డిపార్ట్‌మెంట్‌), డీజీపీ లేదా డీజీపీ నామినేట్‌ చేసిన పోలీస్‌ అధికారి, ఏపీ సీఐడీ చీఫ్‌ లీగల్‌ అడ్వైజర్, జిల్లా జడ్జి, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ, జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌లు ఉంటారు. సంబంధిత సమాచారాన్ని సమీక్షించి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తరువాత మార్గదర్శకాలకు అనుగుణంగా ఐదేళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను విడుదల చేయనున్నారు. ( Bigg Boss 4: ఆ సాయానికి చాలా గర్వంగా అనిపించింది)