Andhra Pradesh: చేపల కోసం వల వేసిన జాలరి.. ఇంతలో ఎదురుగా ఊహించని సీన్.. కట్ చేస్తే!

చేపల కోసం వల వేసిన జాలరికి గట్టి షాక్ తగిలింది. ఇంతలో అతడికి ఎదురుగా ఊహించని సీన్‌ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ జాలరి అవాక్ కావడమే కాదు..

Andhra Pradesh: చేపల కోసం వల వేసిన జాలరి.. ఇంతలో ఎదురుగా ఊహించని సీన్.. కట్ చేస్తే!
Fishermen Net
Follow us

|

Updated on: Feb 03, 2023 | 12:38 PM

చేపల కోసం వల వేసిన జాలరికి గట్టి షాక్ తగిలింది. ఇంతలో అతడికి ఎదురుగా ఊహించని సీన్‌ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ జాలరి అవాక్ కావడమే కాదు.. కొద్దిసేపటికే అక్కడంతా జనం గుమిగూడారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే.?

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా పెద్దపూడిలోని కాలువలో అరుదైన డాల్ఫిన్ హల్చల్ చేసింది. సముద్రం నుంచి ఉప్పుటేరు ద్వారా ఏలూరు కాలువ నుంచి స్థానిక సరస్సులోకి ఈ డాల్ఫిన్ వచ్చి ఉండొచ్చునని మత్స్యకారులు భావిస్తున్నారు. ఇక దాన్ని చూసేందుకు జనం ఒక్కసారిగా గుమిగూడారు. పెదపూడి వద్ద నీరు తక్కువగా ఉండటంతో డాల్ఫిన్ బయటకు కనిపించిందని.. తిరిగి సముద్రంలోకి వదిలేయాలనుకునేలోపు ఆ డాల్ఫిన్ మృతి చెందిందని వాళ్లు అంటున్నారు. కాగా, రెవెన్యూ శాఖ, అటవీ శాఖ అధికారుల సూచనతో పశుసంవర్ధక శాఖ వైద్యులు పంచినామా చేసిన తర్వాత డాల్ఫిన్ కళేబారానికి పూడ్చి పెడతామని జిల్లా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.