Rain Alert: ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న తుఫాన్‌.. వాతావరణశాఖ అలర్ట్‌

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో

Rain Alert: ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న తుఫాన్‌.. వాతావరణశాఖ అలర్ట్‌
Rain Alert
Follow us

|

Updated on: Dec 01, 2021 | 2:25 PM

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఏర్పడిన మరో అల్పపీడనం మళ్లీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మళ్లీ మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య అండమాన్ సముద్రం మరియు దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించిఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం డిసెంబర్ 2వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారనుంది. తరువాత వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరానికి డిసెంబర్ 4వ తేదీ నాటికి చేరే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను ఒకసారి చూద్దాం.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో వాతావరణం పొడిగా ఉంటుంది. రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాఆంధ్ర: ఈరోజు, రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.

రాయలసీమః ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Also Read:

IRCTC Tour : రాజస్థాన్‌ అందాలను చూడాలనుకుంటున్నారా.. అయితే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసమే..

Cop Change Gender: మహిళా పోలీసు కానిస్టేబుల్ లింగ మార్పిడికి అనుమతి.. ఆ రాష్ట్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం!

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..