Vinayaka Chaviti: అదే గందరగోళం.. అదే టెన్షన్.. ఒక్క రోజులో ఎలా.. అయోమయంలో ఏపీ జనం..

ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే గందరగోళం నెలకొంది. చివరి నిమిషంలో గణేష్ ఉత్సవాలకు ఏపీ హైకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఒక్కరోజులో మండపాలు, విగ్రహాల ఏర్పాటు చేసేదెలా అంటూ తలలు పట్టుకుంటున్నారు.

Vinayaka Chaviti: అదే గందరగోళం.. అదే టెన్షన్.. ఒక్క రోజులో ఎలా.. అయోమయంలో ఏపీ జనం..
Vinayaka
Follow us

|

Updated on: Sep 09, 2021 | 2:04 PM

ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే గందరగోళం నెలకొంది. చివరి నిమిషంలో గణేష్ ఉత్సవాలకు ఏపీ హైకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఒక్కరోజులో మండపాలు, విగ్రహాల ఏర్పాటు చేసేదెలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఏపీ హైకోర్టు కూడా పేరుకు పర్మిషన్ ఇచ్చిందే గానీ, అనేక ఆంక్షలు విధించింది. ప్రైవేట్ స్థలాల్లో గణేష్ ఉత్సవాలు జరుపుకోవచ్చంటూనే కండీషన్స్ అప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇదే ప్రజలను గందరగోళంలో పడేసింది. కోవిడ్ రూల్స్ పాటించాలనడం వరకూ ఓకే, కానీ మండపాల్లో ఐదుగురికి మించి ఉండకూడదన్న నిబంధనే ఇబ్బందిగా మారిందంటున్నారు. ఎవ్వరికీ లేని రూల్స్ మాకే ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

గణేష్ ఉత్సవాలపై ఏపీలో కొన్ని రోజులుగా రచ్చ జరుగుతోంది. ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో హైకోర్టుకు వెళ్లారు. విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవద్దంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, వినాయకచవితికి ఒక్కరోజు ముందు పర్మిషన్ ఇవ్వడంతో విగ్రహాల ఏర్పాటుకు ప్రజలెవరూ ముందుకు రావడం లేదంటున్నారు వ్యాపారులు.

కోర్టు ఏం చెప్పిందంటే…

వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు అనుమతులు ఇచ్చింది. గణేష్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ప్రైవేట్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఒకేసారి ఐదుగురు మించకుండా పూజలు చేసుకోవాలని సూచించింది. అలాగే పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించకూడదని తెలిపింది. అయితే ప్రైవేటు స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉత్సవాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్
రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్
అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్
అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే
దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే
SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
హీరోయిన్‌ పైకి వచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్
హీరోయిన్‌ పైకి వచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్
‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు
‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు
అండగా ఉంటాం.. కానీ.. మీరు దాడి చేస్తే సాయం చేయం
అండగా ఉంటాం.. కానీ.. మీరు దాడి చేస్తే సాయం చేయం