Republic Day Celebrations: ఒంగోలులో రిపబ్లిక్ డే వేడుకల్లో అరుదైన సంఘటన.. ప్రకాశం పంతులు మనవవడికి సన్మానం చేసిన జిల్లా కలెక్టర్‌

ఒంగోలులో జరిగిన 72వ గణతంత్ర వేడుకల్లో ఓ జిల్లా కలెక్టర్‌ హోదాలో ఉండి..ఇలా ఓ వ్యక్తికి పాదాభివందనం చేసిన ఈ అరుదైన సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. ఇంతకీ ఇక్కడ సన్మానం పొందిన ఈ పెద్దాయన ఎవరో చెప్పనే లేదుకాదా?...

Republic Day Celebrations: ఒంగోలులో రిపబ్లిక్ డే వేడుకల్లో అరుదైన సంఘటన.. ప్రకాశం పంతులు మనవవడికి సన్మానం చేసిన జిల్లా కలెక్టర్‌
Follow us

|

Updated on: Jan 26, 2021 | 4:44 PM

Republic Day Celebrations: ఒంగోలులో జరిగిన 72వ గణతంత్ర వేడుకల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. గణతంత్ర వేడుకల సందర్బంగా స్వాతంత్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణకు కలెక్టర్‌ పోల భాస్కర్‌, ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గోపాలకృష్ణకు పూలదండ వేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణకు పాదాభివందనం చేశారు..

ప్రకాశం పంతులు కుటుంబం దేశ స్వాతంత్రంలో ఎన్నో త్యాగాలు చేసిందని, ఆ కుటుంబం నుంచి వచ్చిన మీకు ఇవే నా పాదాభివందనాలు అంటూ గోపాలకృష్ణ పాదాలకు కలెక్టర్‌ పాదాభివందనం చేశారు. కలెక్టర్‌ చేసిన ఈ పనితో అక్కడున్న వారంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Also Read: ఒక చిన్న అబద్ధంతో ట్విట్టర్ లో మీమ్స్ గా మారిన హాలీవుడ్ స్టార్.. మరి ఆ అబద్ధం ఏమిటో తెలుసా..!