రాజకీయ రంగు పులుముకున్న Vijayawada GGH అత్యాచార ఘటన.. 10 కీలక పరిణామాలు

Vijayawada News: విజయవాడ జీజీహెచ్ లో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించింది.

రాజకీయ రంగు పులుముకున్న Vijayawada GGH అత్యాచార ఘటన.. 10 కీలక పరిణామాలు
Vijayawada Ggh News
Janardhan Veluru

|

Apr 23, 2022 | 3:06 PM

Vijayawada News: విజయవాడ జీజీహెచ్ లో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించింది. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలికి పరామర్శ పేరుతో నిన్న జరిగిన ఘటన ఇంకా దుమారం రేపుతూనే ఉంది. విజయవాడ GGHలో అత్యాచార బాధితురాలి ముందు జరిగిన గొడవ నేపథ్యంలో బోండా ఉమకు నోటీసులు అందాయి. మహిళా కమిషన్‌ ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన కమిషన్‌ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ ఆఫీస్‌కు వెళ్లారు మహిళా కమిషన్‌ ప్రతినిధులు. చంద్రబాబు లేకపోవడంతో ఇంటికి నోటీసలు అంటించారు. ఈ ఘటనకు సంబంధించి చోటు చేసుకున్న తాజా 10 కీలక పరిణామాలు..

  • టీడీపీ అధినేత చంద్రబాబు, బోండా ఉమకు మహిళా కమిషన్‌ నోటీసులివ్వడంపై టీడీపీ మండిపడింది. తాడేపల్లి ఆదేశాలతో రాజకీయం చేస్తారా అని ప్రశ్నించింది.
  • అత్యాచార ఘటనలో బాధితురాలికి  న్యాయం చేయాలని కోరితే నోటీసులిస్తారా అని టీడీపీ నేత బోండా ఉమా మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
  • టీడీపీ ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. పరామర్శ పేరుతో బలప్రదర్శన చేస్తారా అని నిలదీశారు.
  • అత్యాచార బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించడంతో పాటు కొంతమంది పోలీసులపై చర్యలు కూడా తీసుకుందన్నారు. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు ఉష శ్రీ.
  • రేప్‌ ఇన్సిడెంట్‌ ఇష్యూని సీరియస్‌గా తీసుకున్నారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. నిన్న ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన ఆమె.. ఇవాళ ఎస్పీ కాంతి రాణాతో భేటీ అయ్యారు. కేసుకి సంబంధించిన వివరాలపై ఆరాతీశారు. అలాగే మిస్సింగ్‌ కేసులపై దృష్టి సారించాలని ఎస్పీని కోరారు.
  • అత్యాచారం ఘటనలో సాధ్యమైనంత త్వరగా దోషులకి శిక్షపడేలా ఎస్పీని కోరామన్నారు వాసిరెడ్డి పద్మ.
  • రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌.. రెచ్చగొట్టడానికే విజయవాడ ఆస్పత్రికి వెళ్లిందన్నారు టీడీపీ నేత అనిత.
  • మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు విచారణకు హాజరవుతారా? ఒకవేళ హాజరుకాకుంటే మహిళా కమిషన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏం జరగబోతుందో తెలియాలంటే ఈనెల 27 వరకు వెయిట్ చేయాల్సిందే.
  • మహిళా కమిషన్ సమన్లు జారీ చేయడం సరికాదంటున్నారు సీనియర్ అడ్వకేట్లు. వాళ్లంతట వాళ్లే విచారించి చర్యలు తీసుకునేంత అధికారం లేదన్నారు.
  • అత్యాచార ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు మహిళలపై దాడులు, మిస్సింగ్‌లపై వేగంగా స్పందించాలని కోరుతున్నాయి.

Also Read..

Rahul Gandhi: మోదీ సర్కారుపై విరుచుకపడ్డ రాహుల్ గాంధీ.. మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ..

బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు.. అలా చేస్తే భారీ జరిమానే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu