ఆ మహిళను నమ్మి రెండు కోట్లు మోసపోయా.. లెటర్ రాసి కానిస్టేబుల్ అదృశ్యం.. నంద్యాలలో కలకలం..

నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్‌ మిస్సింగ్ కలకలం రేపింది. బేతంచెర్లలో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సోమ్లా నాయక్ కనిపించకుండా పోయాడు.

ఆ మహిళను నమ్మి రెండు కోట్లు మోసపోయా.. లెటర్ రాసి కానిస్టేబుల్ అదృశ్యం.. నంద్యాలలో కలకలం..
Missing Case
Follow us

|

Updated on: Feb 07, 2023 | 8:33 AM

నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్‌ మిస్సింగ్ కలకలం రేపింది. బేతంచెర్లలో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సోమ్లా నాయక్ కనిపించకుండా పోయాడు. అతని భార్య, కుటుంబసభ్యులు డోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఓ నోట్‌ రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు కానిస్టేబుల్‌ సోమ్లా నాయక్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక మహిళను నమ్మి అప్పులు చేసినట్టు అందులో క్లియర్‌గా రాసిపెట్టాడు. మహిళను నమ్మి రెండు కోట్లు మోసపోయానని.. తన కుటుంబానికి ఎస్పీ న్యాయం చేయాలంటూ దానిలో అభ్యర్థించారు.

చేతిలో ఉన్న సొమ్ముతో పాటు.. బ్యాంక్‌ లోన్లు తీసుకుని మరీ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టాడు. అప్పులోళ్ల నుంచి ఒత్తిడి పెరగడం.. పెట్టుబడి నుంచి రిటన్స్‌ రాకపోవడంతో తాను మహిళను నమ్మి మోసపోయానని గ్రహించిన సోమ్లా నాయక్‌.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎటుపోయాడు, ఏమైపోయాడని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న నంద్యాల జిల్లా పోలీసులు.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..