గుంటూరు శివార్లలో గ్యాంగ్ వార్.. హోం మంత్రి నియోజకవర్గంలో అలజడి.. చర్యలు చేపట్టని పోలీసులు..!

గుంటూరు(Guntur) నగర శివార్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. పగలు, ప్రతీకారాలు, దాడులు, నేరాలతో మార్మోగుతున్నాయి. అల్లరిమూకల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నడిరోడ్డుపైనే దాడులకు పాల్పడుతున్నా పోలీసుల్లో...

గుంటూరు శివార్లలో గ్యాంగ్ వార్.. హోం మంత్రి నియోజకవర్గంలో అలజడి.. చర్యలు చేపట్టని పోలీసులు..!
Guntur Junction
Follow us

|

Updated on: Apr 03, 2022 | 10:18 AM

గుంటూరు(Guntur) నగర శివార్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. పగలు, ప్రతీకారాలు, దాడులు, నేరాలతో మార్మోగుతున్నాయి. అల్లరిమూకల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నడిరోడ్డుపైనే దాడులకు పాల్పడుతున్నా పోలీసుల్లో చలనం రావడం లేదు. మంగళగిరి(Mangalagiri) రూరల్‌ పరిధిలో ఓ హోటల్‌ వద్ద అర్థరాత్రి సమయంలో అల్పాహారం సరఫరా చేయలేదని కొందరు యువకులు మద్యం సేవించి హోటల్‌పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న వాచ్‌మెన్‌ను కత్తితో పొడిచి భయభ్రాంతులకు గురిచేశారు. అది మరవకుండానే ఇటీవల అరండల్‌పేట(Arandal Pet) స్టేషన్‌ పరిధి గౌతమినగర్‌లో రహదారిపై ఆటోలో కూర్చొని మద్యం సేవించటాన్ని ప్రశ్నించిన ఓ కానిస్టేబుల్‌పైనే తాగుబోతులు తిరగబడ్డారు. కానిస్టేబుల్‌ చేతిలో ఫోన్‌ లాక్కుని కిందపడేసి పగలగొట్టారు. ఇవి మచ్చుకు మాత్రమే. వెలుగులోకి రాని ఘటనలు ఇంకెన్నో.. ఫలితంగా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు అల్లరిమూకల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని నల్లపాడు స్టేషన్ కు కొద్ది దూరంలో అన్న స్వర్ణభారతినగర్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతం నగరానికి దూరంగా ఉండటం, జన సంచారం లేకపోవడంతో ఇక్కడ ఏ జరిగిందన్న విషయం పోలీసులకు తెలియదు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అక్కడక రెండు వర్గాల మధ్య గ్యాంగ్‌వార్‌ జరిగింది. ఆ ప్రాంతంలో రెండు సామాజికవర్గాల యువకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అందులో భాగంగా నిత్యం ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకోవటానికి గంజాయి, ఇతర మత్తుపదార్దాలు తీసుకుని హడావుడి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఓ యువకుడిని నడిరోడ్డుపై బంధించి కర్రలతో తీవ్రంగా కొట్టారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియకపోవటం అనుమానాలకు తావిస్తోంది.

ఇది హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. అలాంటి ప్రాంతంలోనే గ్యాంగ్‌వార్‌లు జరగటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ నేరం జరిగినా ఎస్సైలే బాధ్యత వహించేలా సెక్టార్‌ పోలీసింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సెక్టార్‌ పరిధి చాలా పరిమితంగానే ఉంటుంది. దీంతో ఎస్సైకు అక్కడ జరిగిన గ్యాంగ్‌వార్‌ తెలియలేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Also Read

Viral Video: స్టూడెంట్స్‌తో కలిసి బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన కలెక్టర్.. నెట్టింట్లో వీడియో వైరల్

Crime news: ప్రాణం తీసిన పాఠశాల సెలవు.. యంత్రంలో చిక్కుకుని.. కన్నవారి కళ్లెదుటే తెగిపడిన కుమారుడి తల

Summer Health Care: వామ్మో.. కాకరేపుతున్న ఎండలు.. కూల్‌గా ఉండాలంటే వీటిని తీసుకోండి..

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..