టీవీ9 కథనానికి స్పందన.. కోడి పందాల బరులను ధ్వంసం చేసిన పోలీసులు..

సంక్రాంతి దగ్గర పడుతున్నాకొద్దీ కోనసీమలో కోడి పందాల హడావిడి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి...

టీవీ9 కథనానికి స్పందన.. కోడి పందాల బరులను ధ్వంసం చేసిన పోలీసులు..
Kodi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 04, 2022 | 7:49 AM

సంక్రాంతి దగ్గర పడుతున్నాకొద్దీ కోనసీమలో కోడి పందాల హడావిడి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. దీనిపై TV9లో వచ్చిన కథనానికి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం స్పందించింది. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కోడిపందాల బరులపై దాడులు చేశారు. సిద్ధం చేస్తున్నా బరులను ధ్వంసం చేసి.. హెచ్చరిక బోర్లులు పెట్టారు.

పల్లంకుర్రులో కోడి పందాల స్థలం సిద్ధం చేస్తున్నా యజమానులకు రెవెన్యూ, పోలీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కోడిపందాలకు సిద్ధం చేసిన బరులను ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ముమ్మిడివరం సి.ఐ జానకీరాం కోరారు. కోడిపందాలు, గుండాటలు, జూదం వంటి కార్యకలాపాలను నిర్వహించవద్దన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడికత్తలను తయారుచేస్తున్న, గతంలో కోడి పందాలు నిర్వహించిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని చెప్పారు.

Read Also.. AP Corona: దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్‌దడ.. మళ్లీ పుంజుకుంటున్న కరోనా కేసులు.. ఏపీలో కొత్తగా ఎన్నంటే?