Bhadrachalam: భద్రాచలంలో మళ్లీ భయం భయం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. హెచ్చరికలు జారీ

గోదావరి (Godavari) పరివాహకంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నది నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. జులై నెలలో వచ్చిన వరదల నుంచి తేరుకోకముందే మరోసారి ప్రవాహం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది...

Bhadrachalam: భద్రాచలంలో మళ్లీ భయం భయం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. హెచ్చరికలు జారీ
Bhadrachalam Floods
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:39 PM

గోదావరి (Godavari) పరివాహకంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నది నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. జులై నెలలో వచ్చిన వరదల నుంచి తేరుకోకముందే మరోసారి ప్రవాహం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో (Bhadrachalam) గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా మూడో ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే పునారావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. కాగా.. పెరుగుతున్న ఉద్ధృతితో ముంపు మండలాలు వారం రోజులుగా నీటిలో చిక్కుకున్నాయి. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లుపై వరద నీరు చేరింది. దీంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కోరుతున్నారు. అయితే గోదావరికి వరదలు వచ్చి నెల రోజులైనా కాకముందే మరోసారి ప్రవాహం పెరగడంతో భద్రాచలం వాసులు ఆందోళన చెందుతున్నారు.

జులై నెలలో వచ్చిన వరద తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఒకానొక దశలో భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి 70 అడుగులు దాటి ప్రవహించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. భద్రాచలం పట్టణం నీట మునిగింది. రామాలయం చెంతకు గోదావరి నీరు చేరింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి వంతెనపై రెండు రోజుల పాటు రాకపోకలు నిలిపివేశారు. ఆ రోజులను మరిచిపోకముందే మరోసారి వరద వస్తుండటంతో భద్రాచలం వాసులు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?