బ్రేకింగ్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇటీవల బలవన్మరణాకి పాల్పడిన విషయం తెలిసిందే. ఆయనకు గుర్తుగా అభిమానులు విగ్రహన్ని ఆవిష్కరించాలనుకున్నారు.  గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించడానికి..టీడీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికోసం అక్కడి ఎన్టీఆర్ విగ్రహం పక్కన దిమ్మెను నిర్మించారు. అయితే ఈ విషయమై అర్థరాత్రి లింగరావుపాలెంలో వివాదం నెలకుంది. విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి  అనుమతి లేదంటూ పంచాయితీ అధికారులు షాకిచ్చారు. దిమ్మెను ధ్వంసం చేశారు. వారం […]

బ్రేకింగ్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత
Follow us

|

Updated on: Sep 30, 2019 | 9:51 AM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇటీవల బలవన్మరణాకి పాల్పడిన విషయం తెలిసిందే. ఆయనకు గుర్తుగా అభిమానులు విగ్రహన్ని ఆవిష్కరించాలనుకున్నారు.  గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించడానికి..టీడీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికోసం అక్కడి ఎన్టీఆర్ విగ్రహం పక్కన దిమ్మెను నిర్మించారు. అయితే ఈ విషయమై అర్థరాత్రి లింగరావుపాలెంలో వివాదం నెలకుంది. విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి  అనుమతి లేదంటూ పంచాయితీ అధికారులు షాకిచ్చారు. దిమ్మెను ధ్వంసం చేశారు.

వారం క్రితమే విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి కోరామని అయినా అధికారులు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నామని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. కాగా అధికారుల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది.. పాలకేంద్రం సెంటర్ వద్ద విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి  అనుమతి పత్రాలు లేవని..ఒకవేళ ఉంటే తమకేమి అభ్యంతరం లేదని చెప్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు విగ్రహ దిమ్మెను కూల్చివేశారు. దీంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.