15 రోజులుగా స్టూడెంట్స్‌కి గుడ్డు మిస్సింగ్.. ఎమ్మెల్యే ఆగ్రహం

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన 'జగన్న గోరుముద్ద పథకం' క్షేత్రస్థాయిలో సవ్యంగా అమలు కావడం లేదు. గుంటూరు జిల్లాలోని నరసరావు పేట రూరల్‌లోని ఇసప్పాలెం ప్రభుత్వ పాఠశాలలో గత 15 రోజులుగా గుడ్డు ఇవ్వడం లేదని స్టూడెంట్స్..

15 రోజులుగా స్టూడెంట్స్‌కి గుడ్డు మిస్సింగ్.. ఎమ్మెల్యే ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2020 | 4:16 PM

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ‘జగనన్న గోరుముద్ద పథకం’ క్షేత్రస్థాయిలో సవ్యంగా అమలు కావడం లేదు. గుంటూరు జిల్లాలోని నరసరావు పేట రూరల్‌లోని ఇసప్పాలెం ప్రభుత్వ పాఠశాలలో గత 15 రోజులుగా గుడ్డు ఇవ్వడం లేదని స్టూడెంట్స్.. ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు చేయగా.. ఈ పథకంలోని లోపాలు వెలుగు చూశాయి. భోజనం ఎలా ఉందని ఎమ్మెల్యే పిల్లలను అడుగగా.. భోజనం సరిగ్గా ఉండటంలేదని.. 15 రోజులుగా గుడ్డుపెట్టడం లేదని స్టూడెంట్స్ తెలిపారు. దీంతో.. ఉపాధ్యాయులను, స్థానిక ఏజెన్సీ కుకింగ్ సభ్యులను నిలదీశారు. పైనుండి రావడం లేదని వారు తెలపగా.. ఎంఈవో జ్యోతి కిరణ్, ఇతర విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే.. కోడిగుడ్ల సరఫరాను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే సూచించారు.