Andhra Pradesh Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..

అమ్మ నాన్నలు లేని.. అక్కచెల్లెల్లు.. ఆదరిస్తానంటూ మేనమామ అక్కున చేర్చుకున్నాడు. ఆ తర్వాత తనలోని క్రూరుడిని పరిచయం చేశాడు.

Andhra Pradesh Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..
Top 9 News
Follow us

|

Updated on: Oct 22, 2021 | 8:02 AM

1. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయంపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు CM KCR. భారీ మెజార్టీతో గెలిచి తీరుతామన్నారు. హుజురాబాద్ ఇన్‌ఛార్జీలు, ముఖ్యనేతలతో KCR టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మిగిలి ఉన్న వారం రోజులు కష్టపడితే ఫలితం మనదేనని నేతలకు సూచించారు. ఏడేళ్ల కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.

2. వంద కోట్ల వ్యాక్సినేషన్‌ భారత్‌కు గర్వకారణమన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ప్రధాని మోదీ నిరంకుటిత దీక్ష వల్లనే అది సాధ్యమయిందన్నారు. ముఖ్యంగా దీనంతటికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖలోని హెల్త్ వర్కర్స్, వైద్యులు, వైరాలజిస్టులు, ప్రతి ఒక్క ఉద్యోగి చేసిన కృషి అని కొనియాడారు.

3. నిర్మల్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించాలంటూ యువతి వెంటపడుతున్నాడంటూ ఓ యువకుడిని యువతి తరుపు బందువులు విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. మానవత్వాన్ని మంటగలిపే విదంగా చేతులు కాళ్లు కట్టేసి మరీ యువకుడిని చితకబాది చంపేసారు యువతి తరుపు బందువులు.

4.రాజేంద్రనగర్‌లో బాలుడు కిడ్నాప్‌ మిస్టరీగా మారింది. ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక పోలీస్‌ టీమ్స్‌ పని చేస్తున్నాయి. అనుమానితులందరిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులకు.. చిన్న క్లూ దొరికింది. బాలుడిని తీసుకు పోతున్నట్టు ఉన్న ఓ ఫోటో దొరికింది. ఈ ఆధారంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

5. సిరిసిల్లా చేనేత కార్మికులు మరో ఆద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎప్పుడో అగ్గిపెట్టలో పట్టే చీరను తాయు చేశామని విన్న.. నిజాన్ని మరో మారు నిరూపించారు. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌ తయారు చేసి చిన్న శారీని.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీర, స్వామి వారికి పంచలు అందించారు.

6. సైబర్ క్రైం చాలెంజింగ్‌గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. క్రైం అనేది అనేక రూపాంతరాలుగా మారి.. ఇప్పుడు సైబర్ రూపంలో సవాలుగా మారిందన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు డ్రాఫ్ట్ రూపొందిస్తున్నామన్న కేటీఆర్.. ఇందుకోసం నిపుణుల నుంచి సలహాలు స్వీకరిస్తున్నామన్నారు. తెలంగాణ రూపొందించే పాలసీ దేశానికి పాయినీర్ కాబోతుందని స్పష్టం చేశారు.

7. తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు మొత్తం హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్ప‌టికే టీ.ఆర్‌.ఎస్‌, బీజేపీలు హోరాహోరీగా ప్ర‌చారం చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రచారాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ముఖ్య నేత‌లు చాలా వ‌ర‌కు చుట్టుపు చూపుగా వెళ్లి వ‌స్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంకా ప్ర‌చార ప‌ర్వంలోకి దిగ‌డం లేదు.

8. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలో వివాదం కొనసాగుతూనే ఉంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మార్గదర్శకాలు బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించి కృష్ణా నదీ యాజమాన్యబోర్డు -KRMB ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్‌ లేఖ రాశారు.

9. అమ్మ నాన్నలు లేని.. అక్కచెల్లెల్లు.. ఆదరిస్తానంటూ మేనమామ అక్కున చేర్చుకున్నాడు. ఆ తర్వాత తనలోని క్రూరుడిని పరిచయం చేశాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం