Andhra Pradesh: చనిపోయాడని అంత్యక్రియలు.. చిన్నకర్మ రోజు తిరిగివచ్చిన యువకుడు

ఈ నెల  19వ తేదీన సతీష్ బైక్‌ తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. అయితే రాత్రి అయిన కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh: చనిపోయాడని అంత్యక్రియలు.. చిన్నకర్మ రోజు తిరిగివచ్చిన యువకుడు
Nellore City News
Follow us

|

Updated on: Oct 24, 2022 | 1:20 PM

ఇన్ని రోజులు మన మధ్య తిరుగుతూ మనతో ఉన్న మనిషి ఇక లేదు.. జీవితంలో తిరిగి రాని చోటుకు వెళ్ళిపోయాడు అనుకుని విషాదంతో ఉన్న కుటుంబ సభ్యులకు ఆ మనిషి తిరిగి కనిపిస్తే.. ఎలా ఉంటుంది. పట్టరాని సంతోషం.. అప్పుడే తమ ఇంటికి మళ్ళీ పండగ వచ్చింది అన్నంత ఆనందం కలుగుతుంది కదా.. ఇటువంటి వింత సంఘటన తాజాగా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. . చనిపోయాడనుకున్న యువకుడు తిరిగొచ్చాడు. చిన్న కర్మరోజు ఇంటికి వచ్చి అందరికి షాకిచ్చాడు. అవాక్కైన తల్లిదండ్రులు ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటి వరకు తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు కొడుకును చూసి సంబరపడిపోయారు. వివరాల్లోకి వెళ్తే..

మనుబోలు మండలం వడ్లపూడి సర్పంచ్‌ పల్లేటి రమాదేవి కుమారుడు సతీష్ డిగ్రీ చదివాడు. గత కొన్నేళ్లుగా సతీష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మతిస్థిమితం కోల్పోయాడు.. దీంతో తల్లిదండ్రులు అతడికి వైద్యం చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల  19వ తేదీన సతీష్ బైక్‌ తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. అయితే రాత్రి అయిన కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో సమీప గ్రామం వెంకటాచలంలోని కనుపూరు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. పోలీసులు ఈ విషయాన్నీ సతీష్ తల్లిదండ్రులకు తెలిపారు. నీటిలోనుంచి తీసిన మృత దేహం.. బాగా ఉబ్బి ఉండి.. గుర్తు పట్టలేని స్టేజ్ కు చేరుకుంది. అయితే తల్లిదండ్రులు సతీష్ ఆనవాళ్లు కనిపించాయని ధృవీకరించారు. ఆ కుళ్ళిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తల్లిదండ్రులు తమ స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు చిన్న కర్మకు ఏర్పాటు చేస్తున్నారు. ఐదు రోజుల తర్వాత సతీష్ ఇంటికి చేరుకున్నాడు. సజీవంగా ఉన్న సతీష్ ను చూసి మొదట తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులు స్తానికులు షాక్ తిన్నారు. తర్వాత అసలు విషయంతెలుసుకోవడం కోసం ఆరా తీశారు. మరణించాడు అనుకున్న కొడుకు సజీవంగా కనుల ముందుకు చేరుకునే సరికి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, చెరువులో దొరికిన మృతదేహం ఎవరిదన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..