ఉల్లి ఫైట్.. సీఎం జగన్‌పై నారా లోకేష్ ఫైర్
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఓ వైపు పెరుగుతున్న ఉల్లి ధరలతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ పాలనలో ఇసుక కోసం ధర్నాలు.. ఉల్లి కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని విమర్శలు గుప్పించారు. ఒక కిలో ఉల్లి కొనాలంటే.. ప్రజలు వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ట్వీట్‌లో […]

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఓ వైపు పెరుగుతున్న ఉల్లి ధరలతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ పాలనలో ఇసుక కోసం ధర్నాలు.. ఉల్లి కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని విమర్శలు గుప్పించారు. ఒక కిలో ఉల్లి కొనాలంటే.. ప్రజలు వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఉల్లి కోసం జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన వీడియోను నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఆరు నెలల @ysjagan గారి పాలనలో ప్రజలు ఇసుక కోసం ధర్నాలు, ఉల్లి కోసం ఉద్యమాలు చెయ్యాల్సిన దుస్థితి వచ్చింది. కేజీ ఉల్లిపాయల కోసం కూడా, ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. విజయనగరంలో పరిస్థితి ఇది. (1/2) pic.twitter.com/P56Xv5Bh2j
— Lokesh Nara (@naralokesh) December 5, 2019
గతంలో చంద్రబాబు గారి పరిపాలనలో, ఉల్లిపాయల ధరలు పెరిగితే, రేషన్ షాపులు ద్వారా సబ్సిడీ ఉల్లిపాయలు సరఫరా చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసారు. 30 మంది సలహాదారులను పెట్టుకుని కూడా, ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు జగన్ గారు. (2/2)
— Lokesh Nara (@naralokesh) December 5, 2019
కాగా, గత కొద్ది రోజులుగా ఉల్లి ధరలు బంగారంలా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానికానికి అందుబాటులో తెచ్చేందుకు పలు రాష్ట్రాలు సబ్సిడీ ద్వారా అందజేస్తూ.. ఉల్లి ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్గిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా ఉల్లి సబ్సిడీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. మార్కెట్‌లో ఉల్లి ధర సెంచరీ వైపు పరుగెడుతున్నా.. సబ్సిడీ కేంద్రాల్లో మాత్రం కిలో ఉల్లి రూ.25కే అందిస్తోంది. దీంతో ఈ కౌంటర్ల వద్దకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీ కౌంటర్ల వద్ద ఒకే సారి గేట్లు తెరవడంతో.. ప్రజల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కిందపడ్డారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను నారా లోకేష్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది విపరీతంగా వైరల్ అయ్యింది.