ఏలూరులో నారా లోకేష్ పర్యటన.. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకుంటుందని మండిపాటు

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో సొమ్మసిల్లి పడిపోతున్న పిల్లలు, పెద్దల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 185 మంది బాధితులు ఈ వింత రోగం బారిన పడి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏలూరులో నారా లోకేష్ పర్యటన.. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకుంటుందని మండిపాటు
Follow us

|

Updated on: Dec 06, 2020 | 3:55 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో సొమ్మసిల్లి పడిపోతున్న పిల్లలు, పెద్దల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 185 మంది బాధితులు ఈ వింత రోగం బారిన పడి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుండి బాధితులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. శనివారం రాత్రి నగరంలోని పడమర వీధి, కొత్త పేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్‌నగర్‌, తంగెళ్లమూడి, శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతిపేట తదితర ప్రాంతాల్లోనూ బాధితుల సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏలూరులో పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని లోకేష్ పరామ. వాస్తవాలను తెలుసుకునేందుకే తాను వచ్చానని లోకేష్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఆసుపత్రిలో చిన్నారులు, వృద్ధులను చూస్తుంటే బాధగా ఉందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు. పారిశుధ్య లోపం వల్లే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారని, ఏ సమస్యా లేదని చెప్పడానికి హడావిడిగా డిశ్చార్జ్ చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. వైద్య శాఖ మంత్రి సొంత ఊరులోనే ప్రజల ఆరోగ్యానికి భద్రత లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి తలచుకుంటే భయమేస్తుందన్నారు. హెల్త్ ఏమర్జెన్సీ ప్రకటించి బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.