MP Gorantla: కర్నూలులో ఎంపీ గోరంట్లకు ఘన స్వాగతం.. ఫేక్ వీడియోతో బద్నామ్ చేస్తున్నారంటూ మండిపాటు..

చేయని తప్పుకు ఫేక్ వీడియో సృష్టించి నిజమైన వీడియో గా క్రియేట్ చేస్తూ నన్ను.. నా పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే భంగపాటు తప్పదని హెచ్చరించారు ఎంపీ గోరంట్ల మాధవ్. తనకు పోలీసులు సహకరించడం వల్లే తప్పు నుంచి తప్పించుకుంటున్నానని ప్రచారం అవాస్తవమన్నారు.

MP Gorantla: కర్నూలులో ఎంపీ గోరంట్లకు ఘన స్వాగతం.. ఫేక్ వీడియోతో బద్నామ్ చేస్తున్నారంటూ మండిపాటు..
Mp Gorantla Madhav
Follow us

|

Updated on: Aug 14, 2022 | 1:27 PM

MP Gorantla Madhav: కర్నూలులో ఎంపీ గోరంట్ల మాధవ్ కు  కురువ కులస్తులు ఘన స్వాగతం పలికారు. టోల్ ప్లాజా నుంచి బళ్లారి చౌరస్తా వరకు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. మాధవ్ కు మద్దతుగా..  టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి మండిపడ్డారు. తనను గెలిపించిన ప్రజలలో అప్రతిష్ట పాలు చేసేందుకు చులకన చేసేందుకు ప్రయత్నించాలని చూస్తే ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు. చేయని తప్పుకు ఫేక్ వీడియో సృష్టించి నిజమైన వీడియో గా క్రియేట్ చేస్తూ నన్ను.. నా పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే భంగపాటు తప్పదని హెచ్చరించారు. తనకు పోలీసులు సహకరించడం వల్లే తప్పు నుంచి తప్పించుకుంటున్నానని ప్రచారం అవాస్తవమన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నానని టీడీపీ నేతల ప్రచారాన్ని హిందూపురం ఎంపీ మాధవ్ ఖండించారు.

పోలీసు వ్యవస్థ గోరంట్ల మాధవ్ కోసం ఏర్పడలేదు బ్రిటిష్ కాలం నుంచి ఉందన్నారు. అమెరికా ల్యాబ్ లో ఒరిజినల్ వీడియో ఆని మార్ఫింగ్ చేయలేదు అని తేలినట్లు టిడిపి నేతలు చెప్పడం దుర్మార్గామన్నారు. తన ఫేక్ వీడియోని ఎక్కడో అమెరికా ల్యాబ్లో నిజం అన్నట్లుగా చెప్పిన టీడీపీ నేతలు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాటల ఆడియోను అదే అమెరికా ల్యాబ్ కు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడలేద అని రుజువు చేయమంటూ సవాల్ విసిరారు గోరంట్ల. టీడీపీ  నేతలే కాకి డ్రెస్ వేసుకున్న పోలీసుల్లా, జడ్జిల్లా, సైంటిస్టుల్లా, ఇతర అధికారుల్లా తీర్పులు..  ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదని ..  కులాల మధ్య చిచ్చు పెట్టలేదన్నారు గోరంట్ల మాధవ్.

ఒక ఫేక్ వీడియో.. గలీజ్ వీడియో.. పట్టుకొని టీడీపీ నేతలు నిజమైన వీడియోగా తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను నా పార్టీని చులకన భావం చేయాలని చూస్తే భంగపాటు తప్పదన్నారు. బలహీన వర్గాలను టీడీపీ అధినేత చంద్రబాబు ఫేక్ వీడియోలతో అబద్ధపు ప్రచారాలతో నరికివేయాలని చంపేయాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు చేస్తున్న  ప్రయత్నం నెరవేరదన్నారు ఎంపీ గోరంట్ల.

Reporter: Nagi Reddy, Tv9 Telugu