మూడు రాజధానులకు కేంద్రం ఫుల్ సపోర్ట్

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని కావాలంటూ భూములిచ్చిన రైతులు ఉద్యమం నడుపుతున్నవేళ జగన్ సర్కారుకు భారీ ఊరట లభించే తాజా వార్త ఇది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటులో తప్పులేదని..

మూడు రాజధానులకు కేంద్రం ఫుల్ సపోర్ట్
Follow us

|

Updated on: Sep 10, 2020 | 8:56 PM

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని కావాలంటూ భూములిచ్చిన రైతులు ఉద్యమం నడుపుతున్నవేళ జగన్ సర్కారుకు భారీ ఊరట లభించే తాజా వార్త ఇది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటులో తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. మూడు రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ పేర్కొంది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని చెప్పింది. కాగా, మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరో వైపు ఏపీ హైకోర్టులో మూడు రాజధానులపై వాదనలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌తో జగన్ ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించినట్లయింది. ఇటీవల మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ సైతం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు ఇప్పటికే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ లైన్ క్లియర్ చేశారు. రాష్ట్రంలో ఇకపై పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు.. శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి కొనసాగేలా గవర్నర్ రాజముద్ర వేశారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!