Buggana Rajendranath: న్యాయ రాజధానిగా కర్నూలు.. చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా.. మంత్రి బుగ్గన సూటి ప్రశ్న..

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి, కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే..

Buggana Rajendranath: న్యాయ రాజధానిగా కర్నూలు.. చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా.. మంత్రి బుగ్గన సూటి ప్రశ్న..
Buggana Rajendranath
Follow us

|

Updated on: Dec 05, 2022 | 6:50 PM

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి, కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రానికి మూడు రాజధానులు అనే విషయంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్ర విభజన తర్వాత అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశామని, కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో న్యాయ రాజధానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా అనేది చెప్పాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. సీఎం జగన్ హైకోర్టు కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తుంటే.. చంద్రబాబు వాటిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కాలేజీలో రాయలసీమ గర్జన సభ నిర్వహించారు. శతాబ్దాలుగా కరవు ఎదుర్కొంటున్న రాయలసీమ గురించి చంద్రబాబు ఆలోచించాలని బుగ్గన అన్నారు. వందల ఏళ్ల క్రితం అత్యంత సంపద కలిగిన ప్రాంతం రాయలసీమ అని.. కానీ చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్లసీమగానే మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు హైకోర్టు సాధించేవరకు పోరాటం ఆగదని మంత్రి అన్నారు. హైకోర్టు సాధించి.. జగన్నాథ గట్టుపై హైకోర్టు కట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.

కర్నూలు.. రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద నగరం, సౌత్‌ ఇండియాకు ముఖ ద్వారం కర్నూలు. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తే సాధారణ నగరాల కంటే భిన్నమైన అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న కర్నూలు న్యాయ రాజధాని అయితే మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. హైకోర్టు ఏర్పాటైతే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌తో పాటు 43కు పైగా ట్రిబ్యునల్స్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే..1953లో రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును 1956లో హైదరాబాద్ కు మార్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..