AP Weather: డేంజర్ బెల్స్.. మరోసారి ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..

వాతావరణ శాఖ హెచ్చరికలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈసారి కూడా ఆ జిల్లాలకే మరింత వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకుంది.

AP Weather: డేంజర్ బెల్స్..  మరోసారి ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..
Ap Rains
Follow us

|

Updated on: Nov 25, 2021 | 9:46 PM

తెలుగు రాష్ట్రాలకు మరో గండం పొంచి ఉందా.. ? అల్పపీడన ప్రభావంతో మరో తుఫాన్‌ దూసుకొస్తుందా? ఇప్పటికే వరద బీభత్సంతో సతమతమవుతున్న ఏపీకి మరో జలవిలయం తప్పదా? అంటే అవుననే అంటున్నాయి వాతావరణ శాఖ హెచ్చరికలు. ఈసారి కూడా ఆ జిల్లాలకే మరింత వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం వరకు వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు.

వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు తప్పడం లేదు. ఈనెల 18, 19న కురిసిన వర్షాలతో రాయలసీమలోని మూడు జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ బీభత్సం నుంచి ఇంకా తెరుకోక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లుగా వాతావరణశాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఏండీ.

ముఖ్యంగా కడప , నెల్లూరు, చిత్తూరు జిల్లాలపైనే తీవ్రస్థాయిలో ప్రభావం ఉంటుందని వాతావరణకేంద్రం అలర్ట్ చేసింది. అలాగే ఈనెల 27న ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణశాఖ డైరెక్టర్ స్టెలా తెలిపారు. ఇప్పటికే నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలు వరద ప్రభావంతో తల్లడిల్లాయి. తాజాగా అతి భారీ వర్ష సూచన రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం సాయంత్రానికి కల్లా తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం, శనివారం నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. డిసెంబర్‌ 15 వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికీ వరదలు కారణంగా వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఇళ్లు నేలమట్టమవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో అపార నష్టం సంభవించవచ్చని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. నిత్యావసర సరుకులు తెచ్చుకొని ఇంటిలో నిల్వ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:  ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

 100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.