టీడీపీ నేతలకు మంచు విష్ణు సవాల్..!

టీడీపీ నేతలకు మంచు విష్ణు సవాల్..!

శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏపీ సర్కార్ చెల్లించడం లేదంటూ మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ లు శుక్రవారం తిరుపతిలో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు పై కొంతమంది టీడీపీ నేతలు విమర్శలు కూడా చేశారు.. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ కోసమే మోహన్ బాబు ఇలా చేస్తున్నాడని టీడీపీ నేతలు విమర్శలు చేయడం తో హీరో మంచు విష్ణు టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. విద్యార్థులకు ఏపీ […]

Ravi Kiran

|

Mar 23, 2019 | 9:37 PM

శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏపీ సర్కార్ చెల్లించడం లేదంటూ మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ లు శుక్రవారం తిరుపతిలో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు పై కొంతమంది టీడీపీ నేతలు విమర్శలు కూడా చేశారు.. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ కోసమే మోహన్ బాబు ఇలా చేస్తున్నాడని టీడీపీ నేతలు విమర్శలు చేయడం తో హీరో మంచు విష్ణు టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని.. ప్రభుత్వం నుంచి మేము లేఖలో పేర్కొన్న దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. నా ఆస్తులన్నీ అమ్మేసి మీ పార్టీ కు ఇస్తానని మంచు విష్ణు టీడీపీ నేతలకు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. మా నాన్న గారు 25శాతం పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని..అది మీ డబ్బులతో కాదని .. నాన్న గారు నటుడిగా సంపాదించిన డబ్బులతోనే ఇవన్నీ నడిపిస్తున్నారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu